గత ఏడాది దీపావళి సందర్భంగా లాక్ డౌన్ టైంలో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా ఓటిటి రూపంలో విడుదలైన ఆకాశం నీ హద్దురా(తమిళం సూరరై పోట్రు)కు మరో అరుదైన గౌరవం దక్కింది. బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో సూర్య, అపర్ణ బాలమురళి ఇద్దరికీ చోటు దక్కిస్తూ సదరు అకాడెమి లిస్ట్ ని విడుదల చేసింది. ఫైనల్ గా నెగ్గుతారా లేదా అనేది పక్కపెడితే అక్కడి దాకా రావడం అయితే ఖచ్చితంగా అచీవ్ మెంట్ అనే చెప్పాలి. అందులోనూ థియేటర్లలో రాకుండా నేరుగా డిజిటల్ రిలీజ్ దక్కించుకున్న సౌత్ సినిమాకు. అందుకే ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ కు దారి తీసింది.
సుధా కొంగర దర్శకత్వం వహించిన ఆకాశం నీ హద్దురా 2020 డైరెక్ట్ ఓటిటి రిలీజుల్లో అత్యధిక వ్యూస్ రాబట్టుకుని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇటీవలే థియేటర్లో విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి కానీ ఎందుకో అవి సఫలీకృతం కాలేదు. ఈలోగా శాటిలైట్ ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ కావడంతో నిర్మాతలు ఆసక్తి చూపించలేదు. ఒకవేళ తమిళ వెర్షన్ ని ఏమైనా రిలీజ్ చేస్తారేమో చూడాలి. ఒకవేళ జరిగినా సూర్య అభిమానుల నుంచి తప్ప సాధారణ ప్రేక్షకులు మళ్ళీ హాల్ దాకా రావడం అనుమానమే. ఇప్పుడీ ఆస్కార్ వార్త వినగానే సూర్య ఫ్యాన్స్ ఆనందం మాములుగా లేదు. ట్విట్టర్ లాంటి వేదికల్లో గట్టి హడావిడి చేస్తున్నారు.
సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ ఎయిర్ డెక్కన్ అధినేత గోపినాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందింది. సూర్య అద్భుతమైన నటనతో పాటు అపర్ణ బాలమురళి పెర్ఫార్మన్స్ సినిమా స్థాయిని పెంచాయి. దీన్ని హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కానీ హీరో ఎవరనేది ఇంకా బయటికి రాలేదు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం మేకర్స్ కు కలగా మిగిలిపోతున్న ఆస్కార్ ని కనీసం సూర్య అపర్ణలైనా తెస్తారేమో చూడాలి. చాలా విచిత్రంగా ఉండే ఆ అవార్డుల ఎంపిక ప్రక్రియ వల్ల మనకు పురస్కారం వచ్చినా రాకపోయినా మన సినిమాల విలువ పెరగడం తగ్గడం అంటూ ఉండదు కానీ వస్తే అదో ఆనందం