iDreamPost
iDreamPost
ఎనిమిది నెలల సుదీర్ఘ థియేటర్ల లాక్ డౌన్ పీరియడ్ లో ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైన సినిమాల్లో యునానిమస్ గా అందరిని మెప్పించిన సినిమా ఏదీ లేదనే చెప్పాలి. పెంగ్విన్ తో మొదలుపెట్టి కలర్ ఫోటో దాకా ప్రతిదానికి ఎంతోకొంత డివైడ్ టాక్, రివ్యూలు వచ్చిన మాట వాస్తవం. అందుకే డిజిటల్ లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయన్న ఒక రకమైన అభిప్రాయం కూడా ప్రేక్షకుల్లో నెలకొంది. దీన్ని బ్రేక్ చేస్తూ సూర్య ఆకాశం నీ హద్దురా దూసుకుపోతోంది. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ రియల్ లైఫ్ బయోపిక్ మీద అన్ని వర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం దీనికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ తన లెక్కలను ఎప్పటికీ బయటికి చెప్పదు కానీ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం ఇరవై గంటలు గడవక ముందే సుమారుగా 55 మిలియన్లకు పైగా వీక్షణలు సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అయితే ఇందులో ఓ చిక్కు ఉంది. మాములుగా థియేటర్లలో అయితే ఎన్ని టికెట్లు తెగాయి అన్న దాన్ని బట్టి ఎందరు చూశారు అనే క్లారిటీ వచ్చేది. కానీ ఓటిటిలో అలా కాదు. ఓ స్మార్ట్ టీవీలో ఓటిటి సినిమాను ఇద్దరు చూడొచ్చు లేదా పది మంది కలిసి కూర్చుని చూడొచ్చు. ఆ కౌంట్ ని పట్టుకోవడం అసాధ్యం. యావరేజ్ గా ఒక వ్యూలో ఇద్దరు ఉన్నారు అనుకున్నా ఇప్పటికే వంద మిలియన్ల మార్కు దాటేసినట్టే.
డిజాస్టర్ టాక్ వచ్చిన వి, నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి సినిమాలే ఓటిటిలో భారీ వ్యూస్ తెచ్చుకున్న నేపథ్యంలో ఇంత పాజిటివ్ రెస్పాన్స్ తో ఆకాశం నీ హద్దురాకు ఈ స్పందన దక్కడం ఆశ్చర్యమేమీ కాదు. థియేటర్లలో వచ్చి ఉంటే బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నప్పటికీ ఇప్పుడున్న పాండెమిక్ సిచువేషన్ లో సగం సీటింగ్ కెపాసిటీతో కలెక్షన్లు రావడం కష్టం. అందుకే నిర్మాతగా సూర్య తీసుకున్న సబబే అని చెప్పాలి. సుమారు 42 కోట్లకు డీల్ జరిగిందని ఇప్పుడున్న కౌంట్ ని బట్టి చూస్తే ఈజీగా రికవర్ అవుతుందని డిజిటల్ ట్రేడ్ అంచనా వేస్తోంది. మొత్తానికి ఆకాశం నీ హద్దురా ఇతర నిర్మాతలకు ధైర్యాన్ని ఇచ్చిన మాట వాస్తవం