iDreamPost
android-app
ios-app

ఒక్క రకమే ప్రపంచాన్ని చుట్టేస్తోంది

  • Published Sep 21, 2020 | 11:14 AM Updated Updated Sep 21, 2020 | 11:14 AM
ఒక్క రకమే ప్రపంచాన్ని చుట్టేస్తోంది

కోవిడ్‌ 19.. ఈ మాట 2020లో అందరినీ భయపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అందుబాటులో ఉన్న అన్నిదారులను ప్రయత్నిస్తున్నారు. అసలిదేంటి? అనే స్థాయి నుంచి దీనిని అడ్డుకోగలిగే వరకు గత ఎనిమిది నెలల కాలంలో సాగిన ప్రయాణంలో ప్రతి అంశమూ కొత్తే. ప్రాణాలను కాపాడడంలో గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య రంగం మెరుగైంది. దీనికి రికవరీ రేటును తెలియజేసే నివేదికలే నిదర్శనం. అయితే కోవిడ్‌కు సంబంధించిన వైరస్‌లలో వేలాది రకాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విసృతమవుతున్నవి రెండేనని సీసీయంబీ శాస్త్రవేత్తలు తేల్చారు. వీటిలో కూడా ఏ2ఏ అనే రకం మాత్రమే మెజార్టీ స్థాయిలో వ్యాపిస్తోందన్నది వారు చెబుతున్న మాట. అయితే మరో రకమైన ఏ3ఏ రకంగా చెబుతున్నారు. ఇది రాన్రును బలహీన పడడాన్ని కూడా వారు గుర్తించారు.

కాగా ఒకే రకం వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి సులభం అవుతుందన్నది వారు చెబుతున్న శుభవార్త. ఒక వేళ భిన్నమైన వైరస్‌ రకాలు ఉండి ఉంటే వాటన్నిటినీ ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను రూపొందించడం కష్టసాధ్యమయ్యేది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ తదితర వాటిని గురించి ఇప్పటికే పలు దేశాలు కార్యాచరణ రూపొందించుకున్నాయి. వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు కూడా ఆశావహంగానే ఉన్న నేపత్యంలో మానవాళిని కుదిపేస్తోన్న కరోనా మహ్మారికి గట్టిగానే సమాధానం చెప్పేందుకు కృతనిశ్చయంతో ప్రపంచమంతా ఎదురుచూస్తోంది.

ఇదిలా ఉండగా కోవిడ్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాల ఆర్ధిక స్థితిగతులు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఉత్పత్తయ్యే కోవిడ్‌ 19 వ్యాక్సిన్‌ను ఆయా దేశాలు డబ్బులు వెచ్చించి ప్రజలకు ఉచితంగా అందజేసే స్థితిలో ఉన్నాయా? అన్న ప్రశ్న ఇప్పుడు సర్వత్రా విన్పిస్తోంది. మన దేశాన్నే పరిగణనలోకి తీసుకుంటే 138 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేసే పరిస్థితి ఉందా? అన్న సందేహానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు.

ఒక వేళ ప్రజలనే డబ్బులు పెట్టి కొనుగోలు చేసి వినియోగించుకోవాలని చెప్పినా, అత్యధికశాతం మంది పేదలుగా ఉన్న నేపథ్యంలో అలా వినియోగించే వారు ఎందరు? అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇక్కడే పరిస్థితి ఇలా అన్పిస్తుంటే, మరింత అధ్వాన్న ఆర్ధిక స్థితిలో ఉన్న దేశాల వారి పరిస్థితి ఏంకాను. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్గనైజేషన్స్‌ గానీ, ఆరోగ్య సంస్థ గానీ మానవాళికి ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. వీలైనంత వేగంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి, మానవాళికి మహ్మారి నుంచి విముక్తి కలుగుతుందని ఆశిద్దాం.