iDreamPost
android-app
ios-app

ప్రియుడు అనుకొని న్యూడ్ ఫోటోలు పంపింది.. కానీ..

  • Published Jun 03, 2022 | 6:37 PM Updated Updated Jun 03, 2022 | 7:06 PM
ప్రియుడు అనుకొని న్యూడ్ ఫోటోలు పంపింది.. కానీ..

ప్రేముకులు గంటలు, గంటలు మాట్లాడుకోవడాలు, చాటింగ్ చేసుకోవడాలు తెలిసిందే. ఇప్పుడు వాట్సాప్ ద్వారా చాట్, కాల్స్, వీడియో కాల్స్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది హద్దులు దాటి ప్రేమికులే కదా అని సెమి న్యూడ్, న్యూడ్ ఫోటోలు కూడా పంపించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా అలాగే చేసింది. కానీ అవతలి వ్యక్తి తన ప్రియుడు కాదని తెలిసి షాక్ కి గురయింది.

హైదరాబాద్ కు చెందిన ఓ యువతి రాజు అనే ఓ యువకుడితో కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. గతంలో వీరిద్దరూ బాగా ప్రేమించుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. రాజు ఫోన్ నంబర్ కూడా పని చేయలేదు. ఈ యువతి మాత్రం రాజు కోసం ఫోన్ లో ట్రై చేస్తూనే ఉంది. ఎట్టకేలకు ఒక రోజు మెసేజ్ వెళ్లి రిప్లై కూడా వచ్చింది. దీంతో ఆ యువతి సంతోషించి మళ్ళీ ఇదివరకులాగే చాటింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో తనతో చాట్ చేసేది తన బాయ్ ఫ్రెండ్ అనే ఉద్దేశంతోనే న్యూడ్ ఫోటోలు పంపింది.

అయితే ఇద్దరూ ఓ రోజు కలుసుకోవాలని అనుకున్నారు. తీరా కలిసేసరికి అతడు రాజు కాదు అని షాక్ కి గురయింది. ఇన్నాళ్లూ ఆ యువతి చాట్ చేసింది, ఫోన్ లో మాట్లాడింది రాజుతో కాదు మహ్మద్ మోసిన్ అనే మరో వ్యక్తితో అని తెలిసి భయపడింది. రాజు తన ఫోన్ నంబర్ మార్చేయగా, ఆ నంబర్ మోసిన్ కి వచ్చింది. ఈ విషయం తెలియని యువతి రాజునే అనుకోని అలాగే చాట్ చేసింది, న్యూడ్ ఫొటోలు పంపించింది.

అయితే మోసిన ని తన ఫొటోలు డిలీట్ చేయమని ఆ యువతి కోరింది. కానీ మోసిన్ నిరాకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కావాలని బెదిరించాడు. లేదంటే ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పెడతాను అని హెచ్చరించాడు. దీంతో ఆ యువతి షీ టీమ్ ను ఆశ్రయించి కంప్లైంట్ చేయడంతో రంగంలోకి దిగిన షీటీమ్ పోలీసులు మోసిన్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు. మోసిన్ పై 385, 354, 67-ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet