iDreamPost
android-app
ios-app

భర్తతో స్నేహంగా ఉంటోంద‌ని, నలుగురు యువకులతో మ‌హిళ‌ను అత్యాచారం చేయించిన భార్య‌

  • Published May 29, 2022 | 6:40 PM Updated Updated May 30, 2022 | 11:17 AM
భర్తతో స్నేహంగా ఉంటోంద‌ని, నలుగురు యువకులతో మ‌హిళ‌ను అత్యాచారం చేయించిన భార్య‌

హైదరాబాద్ కొండాపూర్ లో గాయత్రి అనే మహిళ ఓ యువతిపై పథకం ప్రకారం నలుగురు యువకులతో దాడి చేయించి, అత్యాచారం కూడా చేయించింది. ఈ సంఘటన బయటకి రావడంతో సంచలనంగా మారింది. శ్రీకాంత్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొండాపూర్ లో ఉంటున్నాడు. బాధితురాలు కూడా కొండాపూర్‌లోని అదే కాలనిలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. వీరిద్దరూ సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది.

వీరి స్నేహంతో అప్పుడప్పుడు ఆ బాధితురాలు శ్రీకాంత్ ఇంటికి కూడా వచ్చేది. శ్రీకాంత్ భార్య గాయత్రితో కూడా మంచిగా ఉండేది. కొన్ని నెలల క్రితం గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని ఆ యువతిని తన ఇంట్లో కొన్ని రోజులు ఉండమని అడిగింది. దీనికి ఆ యువతి సహాయం చేద్దామని ఉండటానికి ఓకే చెప్పింది. ఇంట్లో ఉన్న రోజుల్లో గాయత్రికి తన భర్త శ్రీకాంత్‌, ఆ యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో వారి మధ్య గొడవలు అయ్యాయి. ఈ వ్యవహారంపై ఇటీవల ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసి కొన్ని రోజులకే కేసును విత్‌డ్రా చేసుకుంది.

ఆ తర్వాత యువతిని మాట్లాడాలని ఇంటికి పిలిచింది. కాసేపు మాట్లాడిన తర్వాత పథకం ప్రకారం ఆ యువతిని గదిలోకి తీసుకెళ్లి అప్పటికే అక్కడ ఉన్న కిరాయికి మాట్లాడుకున్న నలుగురు యువకులతో దాడి చేయించింది. యువతి నోట్లో గుడ్డలు కుక్కి తీవ్రంగా హింసించిన ఆ యువకులు తర్వాత ఆమెపై లైంగికదాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘాతుకాన్ని నిందితురాలు గాయత్రి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే వీడియో సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరించింది.

తీవ్రంగా గాయపడిన ఆ యువతిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి గాయత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాయత్రితో పాటు, నలుగురు యువకులను అరెస్టు చేసి విచారిస్తున్నారు.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis