ఆయన స్వరం భాస్వరం.. ఆయన సర్వస్వము సంగీతమయం. పదుల తరాలు గుర్తుపెట్టుకునే చరిత్ర ఆయన ప్రస్థానం. నటనలోని నవరసాల్ని గొంతులో పలికించగల గాన గంధర్వులు, “బాలు” అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే మన శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం.
ప్రతిఒక్కరూ “మా వాడు” అనిపించుకున్న బాలు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ.. స్వరం, సాహిత్యం ఉన్నంత కాలం గతించిపోని గాత్రం ఆయనది. పాడుతా తీయగా అంటూ తెలుగువాళ్ళ మనసుల్లో చెరిగిపోని మద్ర వేసుకున్న మహానుభావుడికి వందనాలు సమర్పిస్తూ, ఆయన పాడిన ఎన్నో వేల తెలుగు పాటల నుంచి కొన్ని మరపురాని పాటలు మీకోసం.
దాదాపు 16 భాషల్లో 40వేల పాటలు పాడగా, 94-95 దశకం తరువాత దాదాపుగా ఆయన పాడిన పాటలు శ్రోతలకు పరిచయం ఉన్న కారణంగా, అంతకు ముందు ఉన్న పాటల్ని మాత్రమే ఈ లిస్ట్ లో చేర్చడం జరిగంది.
కావున, ఈ ప్రయత్నం కేవలం ఆయన్ని స్మరించుకునేందుకే తప్ప ఒక సంఖ్యకు కుదించడమో లేదా తక్కిన పాటల మీద చిన్నచూపు మాత్రం కాదని గమనించగలరు!