అనంతపురం జిల్లా టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాంసం ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన మాజీ చైర్మన్ ప్రకాశ్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను హింసిస్తున్నాడని ప్రకాశ్ నాయుడు భార్య అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రకాశ్ నాయుడుపై కేసు నమోదు చేశారు. 498ఏతో పాటు పలు సెక్షన్ల కింద ప్రకాశ్ నాయుడుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ప్రకాశ్ నాయుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 2004లో చంద్రదండు అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం ప్రకాశ్ నాయుడుకు నామినేటెడ్ పదవి కట్టబెట్టింది. ఏపీ మాంసం ఉత్పత్తుల అభివృద్ధి కార్పొరేషన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.