iDreamPost
android-app
ios-app

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం

ఒక్కరోజులో 36,810 పాజిటివ్ కేసులు – 596 మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొద్దిరోజుల నుండి 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 36,810 పాజిటివ్ కేసుల నిర్దారణ అయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 11,54,917 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 28,099 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.నిన్న ఒక్కరోజులో 596 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ బారినుండి 7,24,702 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 4,01,712 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో ఉగ్రరూపం దాల్చిన వైరస్

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి దడ పుట్టిస్తోంది.ఆదివారం కొత్తగా 8,240 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,695 కి చేరుకుంది.అలాగే కరోనా మరణాలు కూడా గడిచిన 24 గంటలలో భారీగా నమోదయ్యాయి.ఇవాళ ఒక్కరోజే 176 కరోనా మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 12,030 మంది మృత్యువాత పడ్డారు.ఇక ఈరోజు 5460 మంది కరోనా బాధితులు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో వైరస్ నుండి రికవరీ అయిన వారి సంఖ్య 1,75,029 కి చేరింది. ఇవాళ ముంబైలో కొత్తగా 1,035 మందికి వైరస్ సోకగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,423 చేరింది.ఇక ఆదివారం ముంబైలో కరోనా కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 5,755 కి చేరింది.

తెలంగాణాలో 46 వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో నిన్న కొత్తగా 1,198 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో తెలంగాణలో 46,274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11,529 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 34,323 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 422 మంది మృత్యువాత పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో 53 వేలు దాటిన పాజిటివ్ కేసుల నమోదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న రికార్డు స్థాయిలో 4,074 కొత్త  కేసులు నమోదయ్యాయి.. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 53,724 మందికి కరోనా సోకగా 696 మంది మృత్యువాత పడ్డారు. నిన్న ఒక్కరోజే 54 మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగించే విషయం. 24,228 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్  అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28,800 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 14,854,330 మందికి కోవిడ్ 19 సోకగా 613,213 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 8,907,062 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 3,961,429 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 143,834 మంది మరణించారు.