iDreamPost
android-app
ios-app

30 బస్తాల ఉల్లి కోసం 3 వేల మంది జనం

30 బస్తాల ఉల్లి  కోసం 3 వేల మంది జనం

రాష్ట్రంలో ఉన్న ఉల్లి కొరత ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దానికి ఉదాహరణగా కింద సంఘటనను చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే, శృంగవరపుకోట పట్టణంలోని రైతు బజార్ లో ఉల్లిపాయల కోసం జనం పోటెత్తారు. ఉదయం 6 గంటల నుండి రైతు బజార్ నందు 10 క్యూలైన్లు ఏర్పడి, లైన్ కు 60, 70 మంది ఉల్లిపాయల కోసం పడిగాపులు కాస్తున్నారు.

కేవలం ఇద్దరు మాత్రమే ఆధార్ కార్డు నమోదు చేస్తున్నారు. మరోవైపు వచ్చిన వాళ్లే మరలా రావడంతో వినియోగదారులందరికీ ఉల్లిపాయలు అందడం లేదు. శృంగవరపుకోట మండలంలోని వివిధ గ్రామాల నుండి ఉల్లి కోసం ప్రజలు క్యూ లైన్ లో నిలబడ్డారు.

శనివారం కేవలం జిల్లా నుండి 30 బస్తాల ఉల్లి మాత్రమే వచ్చిందని రైతుబజార్ ఎస్టేట్ ఆఫీసర్ కే.సంతోష్ చెబుతున్నారు. క్యూలో నిలబడిన ప్రజలు మాత్రం సుమారు 3వేల మందికి పైగా వేచి ఉన్నారు. ఈ రోజు వచ్చిన 30 బస్తాల సరిపడిన వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుందని, మిగిలిన వారిని మరల స్టాక్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని రైతు బజార్ ఎస్టేట్ ఆఫిసర్లు తెలిపారు.