iDreamPost
android-app
ios-app

విక్రమ్ వెనుక 26 ఏళ్ళ క్లాసిక్ కథ

  • Published Nov 08, 2020 | 10:24 AM Updated Updated Nov 08, 2020 | 10:24 AM
విక్రమ్ వెనుక 26 ఏళ్ళ క్లాసిక్ కథ

నిన్న సాయంత్రం కమల్ హాసన్ కొత్త సినిమా టైటిల్ ని వీడియో టీజర్ రూపంలో విడుదల చేసి లోకనాయకుడి బర్త్ డే కానుకగా ఇచ్చి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి విక్రమ్ అనే టైటిల్ ని పెట్టి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకో స్టార్ హీరో పేరుని ఇలా పెట్టుకున్నారేంటా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు లేకపోలేదు . కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విక్రమ్ టైటిల్ తో కమల్ ఎప్పుడో 1986లోనే ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ అప్పట్లో పెద్ద హిట్టు.

ఈ విక్రమ్ లో డింపుల్ కపాడియా, లిజి, అంబిక హీరొయిన్లుగా నటించగా బాలీవుడ్ ఫేమస్ విలన్ అమ్జాద్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషించారు. దీన్నే తెలుగులో ఏజెంట్ విక్రమ్ 007గా డబ్బింగ్ చేస్తే ఇక్కడా సక్సెస్ అయ్యింది. ఇళయరాజా సంగీతం మరో ప్రధాన ఆకర్షణ. సంఘ విద్రోహ శక్తుల ఆగడాలను ఆరికట్టే గూడచారిగా కమల్ ఇందులో చాలా సాహసాలే చేశారు. అప్పటిదాకా కృష్ణ లాంటి ఒకరిద్దరు తప్ప స్పై సినిమాలు ఎవరూ పెద్దగా చేసే వారు కాదు. కమల్ ఇందులో కూడా తన సత్తాను చాటుకున్నారు. కోటి రూపాయల బడ్జెట్ దాటిన మొదటి తమిళ సినిమా ఇదేనని చెబుతారు. కోలీవుడ్ లో ఫిస్ట్ టైం పాటలను కంప్యూటర్ రికార్డింగ్ చేసిన ఘనత కూడా విక్రమ్ దే.

ఇంత కథ ఉంది కాబట్టే లోకేష్ కనకరాజ్ ఏరికోరి మరీ విక్రమ్ టైటిల్ ను ఎంచుకున్నాడు. నిన్న విడుదల చేసిన టీజర్ లో కమల్ ని భోజన ప్రియుడిగా చూపిస్తూనే ఇంటి నిండా మారణాయుధాలను ఎక్కడెక్కడో దాచినట్టు రివీల్ చేయడం ఆసక్తికరంగా ఉంది . మొత్తానికి క్లూ ఇచ్చినట్టే ఇచ్చి అర్థం కాకుండా చాలా తెలివిగా కట్ చేయించారు లోకేష్. ఇందులో హీరొయిన్ ఎవరు లాంటి వివరాలు ఇంకా చెప్పలేదు. విక్రమ్ సెట్స్ పైకి జనవరి నుంచి వెళ్ళబోతున్నాడు. ఇండియన్ 2 కనక ఆలస్యమయ్యే పక్షంలో దీన్ని వేగంగా పూర్తి చేసి 2021 వేసవికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.