iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్యలో రామ్ చరణ్ ఓ స్పెషల్ రోల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ పాటతో పాటు ఫైట్ కూడా ఉంటుందని గతంలోనే లీకైపోయింది. చిరుకు కాజల్ అగర్వాల్ ఇప్పటికే సెట్ కాగా చరణ్ కు జోడిగా కియారా అద్వానీ లేదా కీర్తి సురేష్ ఇద్దరిలో ఒకరిని గట్టిగా ట్రై చేస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఎలాగూ సినిమా మొత్తం ఉండే పాత్ర కాదు కాబట్టి కాల్ షీట్స్ ఎక్కువ అవసరం పడకపోవచ్చు. కాకపోతే లాక్ డౌన్ అయ్యాక తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు అనే దాన్ని బట్టి హీరోయిన్ల అందుబాటు డిసైడ్ అవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితిలో ఇది ఒకరకంగా పెద్ద ఛాలెంజ్ లాంటిదే. కొరటాల శివ ప్రస్తుతం ఈ ఆప్షన్స్ వేటలోనే ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వ పరిమితుల వల్ల ఆర్ఆర్ఆర్ కనక లేట్ అయ్యేలా ఉంటె వెంటనే ఆచార్యలో రామ్ చరణ్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ని వేగంగా పూర్తి చేస్తారు. చేతిలో స్క్రిప్ట్ తో సహా సర్వం సిద్ధంగా ఉంది కానీ సెట్ పైకి వెళ్ళడంలోనే జాప్యం జరుగుతోంది. దీని సంగతలా ఉంచితే ఆచార్య తర్వాత చేయబోయే లూసిఫర్ రీమేక్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రెహమాన్ ని సెలెక్ట్ చేసినట్టు తెలిసింది. మలయాళం వెర్షన్ లో దీన్ని వివేక్ ఒబెరాయ్ పోషించాడు. మళ్ళీ అదే చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఛాయస్ రెహమాన్ వైపు వెళ్లినట్టు తెలిసింది. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
కథ ప్రకారం హీరో కుటుంబంలోనే ఉంటూ కుట్రలు చేసే బిజినెస్ మెన్ గా ఈ రోల్ బాగా హై లైట్ అయ్యింది. రెహమాన్ ఎలాగూ గత కొన్నేళ్ళుగా తెలుగు ప్రేక్షకులతో టచ్ లోనే ఉన్నాడు కాబట్టి అల్మోస్ట్ ఓకే అయినట్టు వినికిడి. దర్శకుడు సుజిత్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు. మరోవైపు క్యాస్టింగ్ సెలక్షన్ కూడా వేగవంతం చేశారు. చాలా పాత్రలు ఉండటంతో రిచ్ నెస్ కోసం స్టార్ డం ఉన్నవాళ్ళనే తీసుకునేలా ప్లానింగ్ జరుగుతోందట. ఒకవైపు సిసిసి పనులతో ఆచార్య, లూసిఫర్ రీమేక్ వ్యవహారాలతో చిరు బాగా బిజీగా ఉన్నారు. అమితాబ్ కు కరోనా పాజిటివ్ వచ్చాక దేశంలోని యావత్ సినీ పరిశ్రమ అలెర్ట్ అయిపోయింది. కేసులు పూర్తిగా తగ్గేవరకు భారీ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళడం అనుమానమే