Idream media
Idream media
 
        
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. తుముకూరు జిల్లాలోని పావగడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు వైఎన్ హోస్‌కోట నుంచి పావగడ వెళుతుండగా.. పావగడ సమీపంలో అదుపతప్పి బోల్తాపడింది. బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటనా స్థలంలోనే 10 మంది మరణించారు. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇతర ప్రయాణికులకు గాయాలయ్యాయని సమాచారం. క్షతగాత్రులను వెంటనే పావగడ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.
