Nidhan
ఒక స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు కాస్తా బాధలో మునిగిపోయాడు.
ఒక స్టార్ క్రికెటర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. పండంటి బిడ్డను ఎత్తుకోవాల్సినోడు కాస్తా బాధలో మునిగిపోయాడు.
Nidhan
గ్రౌండ్లో తమ అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ అలరించే క్రికెటర్ల జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉంటాయి. పైకి వాళ్లు సంతోషంగానే కనిపిస్తారు. కానీ పైకి చెప్పలేని కష్టాలు, కన్నీళ్ల కథలు వారి లైఫ్‌లోనూ ఉంటాయి. సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నా, కోట్లాది రూపాయాల సంపాదన ఉన్నా.. వాళ్లూ సాధారణ మనుషులే. మనలాగే ఫ్యామిలీకి వాళ్లూ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేరు. ఆ బాధ నుంచి బయటికొచ్చి మళ్లీ క్రికెట్ ఆడటం అంత ఈజీ కాదు. ఇప్పుడు న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మన్ డెవాన్ కాన్వే పరిస్థితి అలాగే ఉంటుంది. కాన్వే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీని నుంచి అతడు ఇప్పట్లో బయటపడటం కష్టంగానే ఉంది.
పండంటి బిడ్డను ఎత్తుకుంటామని సంతోషంగా ఎదురుచూస్తున్న కాన్వే-కిమ్ దంపతులకు శోకమే మిగిలింది. ఈ ప్రపంచంలోకి రాకుండానే వారి పాపాయి తల్లి గర్భంలోనే కన్నుమూసింది. ఈ విషయాన్ని కాన్వే సతీమణి కిమ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘నా పర్సనల్ లైఫ్ గురించి అందరితో పంచుకునేందుకు అంతగా ఇష్టపడను. కానీ గర్భస్రావం వల్ల నాలాంటి ఎంతో మంది మహిళలు ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదుర్కొంటారో తెలుసు. అయినా, ఈ విషయాన్ని పంచుకునేందుకు నేనేమీ బాధపడటం లేదు. అలాగని సిగ్గుపడటమూ లేదు. ఎందుకంటే.. నాలాగే ఏ స్త్రీకైనా ఇలాంటి విపత్కర పరిస్థితి వస్తే ఆమె హృదయం ముక్కలైతే తట్టుకునే శక్తి ఉండాలి కదా! అందుకే నా మనసులోని భావాలను అందరితో షేర్ చేస్తున్నా. ఏదో ఓ రోజు మా లైఫ్‌లో తిరిగి అద్భుతం జరుగుతుంది. తను మళ్లీ వస్తే బోలెడంత ప్రేమను కురిపించేందుకు మేం రెడీగా ఉంటాం’ అని కిమ్ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది.
కాన్వే భార్య నోట్ చూసిన అభిమానులు విచారం వ్యక్తం చేసుకున్నారు. పండంటి బిడ్డను ఎత్తుకుంటారని అనుకుంటే ఇలా అయిందేంటని బాధపడుతున్నారు. దీని నుంచి ఆ దంపతులు త్వరలోనే బయటపడాలని కోరుకుంటున్నారు. కాగా, చాన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న కాన్వే-కిమ్ 2020లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో 2022లో సౌతాఫ్రికాలో తమ సంప్రదాయ పద్ధతిలో మ్యారేజ్ చేసుకున్నారు. ఇక, న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్లలో ఒకడైన కాన్వే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్ గత సీజన్లో సీఎస్కే విన్నర్‌గా నిలవడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 672 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల లిస్టులో మూడో ప్లేసులో నిలిచాడు.
ఇదీ చదవండి: Prithvi Shaw: చరిత్ర సృష్టించిన పృథ్వీ షా.. ఏకైక భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు!
Devon Conway’s wife#devonconway #instagram #post #sport #rvcjsports #rvcjinsta pic.twitter.com/NT1JTWeftI
— RVCJ Sports (@RVCJ_Sports) February 10, 2024