iDreamPost
android-app
ios-app

అమెరికాలో NRI కుటుంబం అనుమానాస్పద మృతి!

  • Published Oct 07, 2023 | 10:49 AM Updated Updated Oct 07, 2023 | 10:49 AM
  • Published Oct 07, 2023 | 10:49 AMUpdated Oct 07, 2023 | 10:49 AM
అమెరికాలో NRI కుటుంబం అనుమానాస్పద మృతి!

ఇటీవల కొంతమంది డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా పాల్పపడుతున్నారు. దొంగతనాలు, ఎదుటి వారికి మాయమాటలు చెప్పి ఈజీగా బురిడీ కొట్టిస్తూ మోసం చేస్తున్నారు. కొంతమంది డబ్బు, నగల కోసం హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఎన్ఆర్ఐ కుటుంబంలో ఇంట్లో అనుమానాస్పద స్థితిలో విగతజీవులుగా కనిపించడం తీవ్ర కలకలం చేపింది. వివరాల్లోకి వెళితే..

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. న్యూజెర్సీలోని ప్లెయిన్స్ బోరో ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న తేజ్ ప్రతాప్ సింగ్ (43), సోనాల్ పరిహార్ (42) లతో పాటు వారి కుమారుడు, కూతురు ఇంట్లోనే విగతజీవులుగా పడి ఉన్నారని పోలీసులు తెలిపారు. తేజ్ ప్రతాప్ కి వారి బంధువులు ఫోన్ చేయగా ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో పోలీసులకు కాల్ చేసి వారి పరిస్థితి ఏంటని పోలీసులను కోరగా.. వారు తేజ్ ప్రతాప్ ఇంటికి వెళ్లి చూడగా ఈ దారుణం వెలుగు చూసింది.

తేజ్ ప్రతాప్ మొదట కుటుంబ సభ్యులను చంపి తర్వాత తాను ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దాంతో పాటు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక తేజ్ ప్రతాప్ కుటుంబ సభ్యులు చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ కుటుంబ సభ్యులు అందరితో ఎంతో సంతోషంగా, స్నేహపూర్వకంగా ఉండేవారి ఎలాంటి సమస్యలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ఘోరం జరుగుతుందని ఊహించలేదని అంటున్నారు. కాగా, తేజ్ ప్రతాప్ ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సోనాల్ పరిహార్ ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş