iDreamPost

హైదరాబాద్ సిటీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. రోడ్డుపై పార్కింగ్ చేస్తే ఇక అంతే..

ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠిన తరం చేసినా డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠిన తరం చేసినా డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

హైదరాబాద్ సిటీలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. రోడ్డుపై పార్కింగ్ చేస్తే ఇక అంతే..

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అవగాహన లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.. అంగవైకల్యంతో బాధపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందకు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. వాటిని పలువురు వాహనదారులు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాలకు కారణం అవుతున్న వారిపై కొరడా ఝులిపించేందుకు కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నారు అధికారులు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ సిటీలో వాహనాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. దానితోపాటే ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే వాహనదారులకు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడమే కాదు.. భారీగా ఫైన్లు కూడా విధిస్తామని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది వాహనదారులు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిటీలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరింత కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకువస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాల్స్, ధియేటర్లు, వ్యాపార భవన సముదాయల వద్ద రోడ్డు పై పార్క్ చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తామని మాదాపూర్ ట్రాఫిక్ డీసీసీ, డీవీ శ్రీనివాస్ హెచ్చరించారు.

ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఈ నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని తెలిపారు. పాదాచారులు ఫుట్ పాత్, ఫుట్ ఓవర్ బ్రిడ్జీ లను వినియోగించుకోవాలి, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తప్పని సరిగా యూనీఫాం వేసుకోవాలని సూచించారు. రాంగ్ రూట్ లో నడిపి ప్రమాదాలకు కారకులైతే 304 పార్ట్ 2 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలో 55 పేలికన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇక ఫుట్ పాత్ ని ఆక్రమించి వ్యాపారాలు కొనసాగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు నిషేదిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై నడిపితే మోటర్ వాహనాల యాక్ట్ లో సెక్షన్ ల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి