iDreamPost

RRRలో జక్కన్న చీటింగ్.. సీన్ లో జనం లేకపోయినా చిన్న ట్రిక్ తో!

Komaram Bheemudo CG Breakdown: రాజమౌళి- తారక్- రామ్ చరణ్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ మూవీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో కొమురం భీముడో సాంగ్ అయితే ప్రేక్షకుల హృదయాలను కదిలించిన పాట. అలాంటి పాటలో రాజమౌళి చేసిన మ్యాజిక్ చూడండి.

Komaram Bheemudo CG Breakdown: రాజమౌళి- తారక్- రామ్ చరణ్ కెరీర్ లో ఆర్ఆర్ఆర్ మూవీకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో కొమురం భీముడో సాంగ్ అయితే ప్రేక్షకుల హృదయాలను కదిలించిన పాట. అలాంటి పాటలో రాజమౌళి చేసిన మ్యాజిక్ చూడండి.

RRRలో జక్కన్న చీటింగ్.. సీన్ లో జనం లేకపోయినా చిన్న ట్రిక్ తో!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఇంత వేగంగా ఎదుగుతోంది అంటే అందులో టెక్నాలజీ పాత్ర కూడా చాలా ఉంది. సాంకేతికత వాడకం సినిమాలో పెరిగిన తర్వాత సులభంగా షూటింగ్ చేస్తున్నారు. అస్సలు సాధ్యం కాదు అనుకునే సీన్ ని కూడా ప్రేక్షకులు విజిల్స్ వేసేలా చూపిస్తున్నారు. అలాంటి సినిమాలు హాలీవుడ్ లో ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇటు ఇండియన్ సినిమాలో కూడా టెక్నాలజీ వాడకం బాగానే పెరిగిపోయింగి. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తన విజన్ కు ఈ టెక్నాలజీని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. అలా సృష్టించిన ఒక అద్భుతం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం.

 ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వరల్డ్ మూవీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటు నాటు పాటతో ఆస్కార్ ని తీసుకొచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ ల కష్టానికి ఆ సినిమా సాధించిన సక్సెస్ నిదర్శనం అని చెప్పచ్చు. బాహుబలితో రాజమౌళి ప్రపంచాన్ని ఇండియన్ సినిమా వైపు చూసేలా చేశాడు. కానీ, ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రం ప్రపంచం మొత్తాన్ని టాలీవుడ్ మేకింగ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. జక్కన్న విజన్, టేకింగ్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ డైరెక్టర్లు సైతం శభాష్ అన్నారు. ముఖ్యంగా వరల్డ్ లోనే టాప్ డైరెక్టర్ గా పేరు గాంచిన జేమ్స్ కేమరూన్ కూడా రాజమౌళి సినిమాకి ఫిదా అయిపోయాడు.

జక్కన తల్చుకుంటే ఎలాంటి వండర్స్ సృష్టిచగలడో అందరికీ తెలుసు. అలాంటి వండర్ లో భాగమే ఆర్ఆర్ఆర్ మూవీలో తీసిన కొమురం భీముడో సాంగ్. జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే.. కెరీర్ లోనే టాప్ 3 స్థానంలో కొమురం భీముడో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లో తారక్ కేవలం కళ్లతోనే భావాలను పలికించాడు. ఆడియన్స్ హృదయాలను కదిలించాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తే ఈ పాట గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ ని రామ్ చరణ్ పట్టుకున్న తర్వాత బ్రిటిష్ అధికారులు శిక్ష విధిస్తారు. ఆ శిక్షలో భాగంగా రామ్ చరణ్ కొరడాతో జూనియర్ ఎన్టీఆర్ ని కొడుతూ ఉంటాడు. ఆ ఘటనను స్థానికంగా ఉన్న జనాలు చూస్తూ ఉంటారు. అక్కడ వేలకు వేలు జనాలు ఉన్నట్లు సాంగ్ లో చూపిస్తారు.

అక్కడ కేవలం పదుల సంఖ్యలోనే జనాలు ఉన్నారు. అలా ఎలాఅంటే సాధారణంగా గ్రాఫిక్స్ గురించి అందరికీ తెలిసిందే. ఆ గ్రాఫిక్స్ ని వాడటంలో జక్కన్న సిద్ధ హస్తుడు. లైవ్ లో కొంత మందిని పెట్టి ఆ తర్వాత ఎన్ లార్జ్ చేసుకుంటూ సీజీ వర్క్ లో వేల మంది జనాలు ఉన్నట్లు చూపించారు. మాములుగా రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఇలాంటి గ్రాఫిక్స్ సీన్స్ డీ కోడ్ చేస్తూ కొందరు వీడియోలు చేస్తూ ఉంటారు. అలాంటి వీడియో ఒకటి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. అలాగే ఈ సీజీ వర్క్ కి సంబంధించి ఫొటోలు కూడా నెట్టింట ఉన్నాయి. మరి.. జనాలు లేకపోయినా వేల మందిని చూయించిన జక్కన్న టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి