iDreamPost

హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్..త్వరలో ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్ నగరంలో విభిన్న ప్రాంతాలకు చెందిన వారు వచ్చి జీవిస్తుంటారు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు. ఇక నగరానికి నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు జరుగుతుంటాయి. ఇప్పటికే ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది.

Hyderabad: హైదరాబాద్ నగరంలో విభిన్న ప్రాంతాలకు చెందిన వారు వచ్చి జీవిస్తుంటారు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు. ఇక నగరానికి నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు జరుగుతుంటాయి. ఇప్పటికే ఉన్న మూడు ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్..త్వరలో ప్రారంభం!

దక్షిణ భారత దేశంలో అతి ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి.  ఇక్కడి దేశంలోని నలుమూల నుంచి ఎంతో మంది వచ్చి, జీవనం సాగిస్తుంటారు. ఇక నగరంలో రోజూ రోజుకు జనాభా బాగా పెరిగి పోతున్నారు. ముఖ్యంగా బస్సు స్టేషన్, రైల్వే స్టేషన్ లో  రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక ప్రత్యేక సందర్భాల్లో అయితే రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతాయి. ప్రస్తుతం నగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ అనే మూడు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. తాజాగా మరో కొత్త రైల్వేస్టేషన్  ఏర్పాటైంది. త్వరలో దీని ప్రారంభం జరగనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ నగరంలో విభిన్న ప్రాంతాలకు చెందిన వారు వచ్చి జీవిస్తుంటారు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేసుకుంటారు. ఇక నగరానికి నిత్యం పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలు జరుగుతుంటాయి. మూడు ప్రధాన స్టేషన్ల నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. కాచిగూడ , సికింద్రాబాద్ ,నాంపల్లి నుంచి అనేక ప్రాంతాలకు రైళ్లు ప్రారంభమవుతుంటాయి. దేశవ్యాప్తంగా ఈ స్టేషన్ల నుంచే ట్రైన్లు నడుస్తున్నాయి. రైళ్ల సంఖ్య పెరగడంతో స్టేషన్లలో రైళ్లకు  ప్లాట్ ఫామ్ దొరకడం చాలా కష్టం మారుతుంది. అందుకే రైలును స్టేషన్ బయటనే గంటల కొద్ది ఆపేస్తుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ.. మరో కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణానికి  రైల్వేశాఖ శ్రీకారం చుట్టుంది. ఈ కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో ప్రారంభం కానుంది

హైదరాబాద్ నగరానికి  ఏర్పాటు కానున్న నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ స్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న ప్రారంభోత్సవం ఆగిపోయింది. ఇక స్టేషన్ అందుబాటులోకి వస్తే..ప్రయాణికుల కష్టాలు చాలా వరకు తీరినట్లు అవుతాయని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ లో మొత్తం 5 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్టేషన్‌ భవనంలోనే టికెట్‌ కౌంటర్లు, కార్యాలయం సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే.. చాలా వరకు రైళ్ల రద్దీ సమస్య తీరినట్లు అవుతుంది. ఇక్కడి నుంచి రైళ్లు ప్రారంభమైతే..చాలా వరకు సమయం ఆదా అవుతుందని పలువురు ప్రయాణికులు అభిప్రాయ పడుతున్నారు. మొత్తంగా మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుండటంపై నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి