iDreamPost

బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు

బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్ తప్పదు

గత ఏడాది అల వైకుంఠపురములోతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ఈ ఏడాది చూస్తామని ఎదురు చూస్తున్న అభిమానులకు ఇంకా నిరీక్షణ తప్పేలా లేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం దర్శకుడు సుకుమార్ కొంత అస్వస్ధతకు గురయ్యారట. కరోనా కాకపోయినా వేరే కారణాల వల్ల ప్రస్తుతం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారని వినికిడి. ఈ కారణం వల్లే అనుకోకుండా బ్రేక్ దొరికిన అల్లు అర్జున్ ఇటీవలే తన అన్నయ్య అల్లు వెంకటేష్ నిర్మాతగా మారి తీస్తున్న గని షూటింగ్ కు వెళ్లి కొంత సమయం గడపడం సోషల్ మీడియా ఫొటోల్లో చూశాం.

డిసెంబర్ రిలీజ్ ను రఫ్ గా ప్లాన్ చేసుకున్న పుష్ప ఈ లెక్కన ఆ టార్గెట్ ని చేరుకోవడం కొంత కష్టమే. జూలై ని మినహాయిస్తే ఈ ఏడాదిలో ఇంకో అయిదు నెలలు మాత్రమే చేతిలో ఉంటాయి. ఇంకా చెప్పుకోదగ్గ భాగమే పుష్పకు పెండింగ్ ఉందట. ఇలా బ్రేకుల మీద బ్రేకులు పడితే విడుదల వాయిదా పడటం తప్ప వేరే మార్గం ఉండదు. అదే జరిగితే 2022లో పుష్ప 1 రిలీజ్ అనుకుంటే రెండో భాగానికి చాలా టైం పడుతుంది. మధ్యలో వేణు శ్రీరామ్ ఐకాన్ సినిమా చేసే ఆలోచన బన్నీ సీరియస్ గానే చేస్తున్నాడు. కాకపోతే అధికారికంగా చెప్పడం లేదు. పరిణామాలన్నీ ఊహించని విధంగా మారుతున్నాయి కాబట్టి ఎవరూ తొందరపడటం లేదు.

పుష్పని పాన్ ఇండియా లెవెల్ లో ప్రెజెంట్ చేయడం కోసం అన్ని రకాల స్ట్రాటజీలు సిద్ధం చేస్తున్నారు. డబ్బింగ్, రీమేక్స్ లాంటివి లేకుండా అన్ని భాషల్లోనూ పుష్ప ఒరిజినల్ వెర్షనే జనానికి చేరేలా మైత్రి సంస్థ, అల్లు టీమ్ ఇద్దరూ గట్టి ప్లాన్స్ వేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాసిల్ విలనిజం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. అక్టోబర్ లేదా నవంబర్ లో పుష్ప ఆడియో రిలీజ్ ని దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కన్సర్ట్ తో భారీగా ప్లాన్ చేస్తున్నారట. అప్పటికంతా కరోనా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా స్కెచ్ ఉంటుందని తెలిసింది. సో అల్లు ఫ్యాన్స్ వెయిటింగ్ త్వరగా తీరడం కష్టమే

Also Read: బన్నీ ప్లానింగ్ వేరుగా ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి