iDreamPost

Rishab Shetty: టెన్త్ ఫలితాల్లో కర్నాటక టాపర్ గా రైతు బిడ్డ.. ఏకంగా ‘కాంతార’ హీరో సర్‌ఫ్రైజ్!

ఇటీవల కర్నాటక రాష్ట్రానికిచ చెందిన పదో తరగతి ఫలితాలు వెల్లువడ్డాయి. ఈ రిజల్ట్స్ లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్‌ ఇండియా స్టార్‌హీరో రిషబ్‌ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేకాక ఆమెకు సంబంధించి అదిరిపోయే కామెంట్స్ పోస్టు చేశారు.

ఇటీవల కర్నాటక రాష్ట్రానికిచ చెందిన పదో తరగతి ఫలితాలు వెల్లువడ్డాయి. ఈ రిజల్ట్స్ లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్‌ ఇండియా స్టార్‌హీరో రిషబ్‌ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేకాక ఆమెకు సంబంధించి అదిరిపోయే కామెంట్స్ పోస్టు చేశారు.

Rishab Shetty: టెన్త్ ఫలితాల్లో కర్నాటక టాపర్ గా రైతు బిడ్డ.. ఏకంగా ‘కాంతార’ హీరో సర్‌ఫ్రైజ్!

నేటికాలంలో చాలా మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడం లేదు. వాళ్లు ఎంతలా శ్రమ పడి చదివిస్తున్నారనే ఆలోచన కూడా చేయడం లేదు. కానీ కొందరు పిల్లలు తమ పేదరికంలో ఉన్న కూడా చదువుపై మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయ్యరు. తల్లిదండ్రులు.. తమ కోసం చింధించే ప్రతి చెమటి చుక్కకు న్యాయం చేయాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో రేయింబవళ్లు కష్టపడి..పరీక్షలు రాస్తుంటారు. చివరకు అనుకున్న లక్ష్యం చేరుకుని తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణం అవుతుంటారు. అంతేకాక తమ విజయంతో సెలబ్రిటీల నుంచి కూడా అభినందనలు అందుకుంటారు. ఆ కోవకు చెందిన విద్యార్థిని అంకిత బసప్ప. ఆమెపై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు కురిపించారు.

గురువారం కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.  ఈ ఫలితాల్లో అనేక అద్భుత సంఘటనలు చోటుచేసుకున్నాయి. పేదింటి బిడ్డలు తమ సత్తా చాటారు. బాగల్ కోట్ జిల్లాకు చెందిన అంకిత బసప్ప పదో తరగతి ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరు శాతం మార్కులను సాధించింది. అదరగొట్టింది. చాలా అరుదుగా సాధించి ఫీట్ ను అంకితా అందుకుంది. ఓ అరుదైన రికార్డును తన పేరిట నమోదు చేసింది. ఎస్ఎస్సీ ఫలితాల్లో  ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇక అంకితా కుటుంబ విషయం తెలిస్తే అందరు ఆశ్చర్యపోతారు. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు, అలానే తల్లి గృహిణి. ఆమె తండ్రి వ్యవసాయం చేసుకుంటూనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆ ఆదాయంతోనే బిడ్డను చదివిస్తున్నాడు.

ఈ క్రమంలోనే అంకిత సాధించిన మార్కులతో ఆమె కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్‌ తాలుకాలో ఉన్న  మొరార్జీ దేశాయ్‌ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోయింది. ఇక తన విజయం గురించి అంకిత స్పందించింది. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించినట్లు తెలిపింది. అలానే భవిష్యత్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి..  తరువాత ఐఏఎస్‌ కావాలనేది తన లక్ష్యమని తెలిపింది. ఐఏఎస్ అయ్యి  ప్రజలకు సేవ చేయాలనే కోరిక ఉన్నట్లు అంకిత తెలిపింది. ఇక అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్‌ రిషబ్‌ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్‌ చేశారు. స్టేట్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి అంకితా ఫోటోను శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ప్రశంసలు కురిపించారు.

 

View this post on Instagram

 

A post shared by Rishab Shetty (@rishabshettyofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి