బన్నీ ప్లానింగ్ వేరుగా ఉంది

By iDream Post Jul. 16, 2021, 05:35 pm IST
బన్నీ ప్లానింగ్ వేరుగా ఉంది

ఈ ఏడాది రూపొందుతున్న పాన్ ఇండియా భారీ సినిమాల్లో ఒకటిగా ఇప్పటికే విపరీతమైన అంచనాలు మోస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ ప్రస్తుతం వేగమందుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం డిసెంబర్ మూడో వారం విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే దర్శకుడు సుకుమార్ వేగం పెంచారని అందుకే చకచకా పూర్తి చేసేలా ఆర్టిస్టుల బల్క్ డేట్స్ ని తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. అయితే లేటెస్ట్ వెర్షన్ దానికి భిన్నంగా ఉంది. ఈ ఏడాదిలో పుష్ప మొదటి భాగం రావడం అనుమానమే అంటున్నారు. దానికి కారణాలు కూడా రీజనబుల్ గానే ఉన్నాయి.

పుష్ప షూటింగ్ చాలా బాలన్స్ ఉంది. విలన్ ఫహద్ ఫాసిల్ ఇంకా పూర్తి స్థాయిలో సెట్లో అడుగు పెట్టనే లేదు. అది కూడా అతనే ఓ ఇంటర్వ్యూలో చెబితే బయట పడింది. ఒకవేళ డిసెంబర్ ని టార్గెట్ పెట్టుకుంటే చేతిలో ఉన్నది నాలుగు నెలలు. పోస్ట్ ప్రొడక్షన్, మ్యూజిక్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్, లిరికల్ వీడియోస్, టీజర్ ట్రైలర్ల రిలీజులు, నేషనల్ మీడియాలో ఇంటర్వ్యూలు, ప్రోగ్రాంలు ఇలా సవాలక్ష పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. ఇవన్నీ ఇంత తక్కువ టైంలో పూర్తి చేయడం అంత ఈజీ కాదు. పైగా పుష్పని చాలా పెద్ద స్కేల్ లో నార్త్ లో రిలీజ్ చేయాలని అల్లు అర్జున్ పట్టుదలగా ఉన్నాడు.

అలాంటప్పుడు పుష్పను డిసెంబర్ కు లక్ష్యంగా పెట్టుకుంటే రీచ్ లో తేడాలు రావొచ్చు. అందుకే వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేయొచ్చని వినికిడి. కానీ సంక్రాంతికి ఛాన్స్ తక్కువ. ఇప్పటికే సర్కారు వారి పాట, అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ లు ఆ సీజన్ మీద కన్నేశాయి. ఒకవేళ వీటిలో ఏదైనా డ్రాప్ అయితే అప్పుడు పుష్పకు అడ్వాంటేజ్ దొరుకుతుంది. గత సంవత్సరం సరిలేరు నీకెవ్వరూతో పోటీ పడి మరీ ఆల వైకుంఠపురములోతో పై చేయి సాధించిన బన్నీ కాంపిటీషన్ గురించి ఆలోచిస్తాడని అనుకోలేం. సో పుష్ప 2021లోనే గ్యారెంటీగా వస్తుందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి మైత్రి వాళ్ళ మనసులో ఏముందో

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp