iDreamPost

గుజరాత్ పరుగుల సునామీకి రుతురాజ్ బ్రేకులు.. ఇది నెక్ట్స్ లెవల్ కంబ్యాక్!

CSK vs GT- Captain Ruturaj Gaikwad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ పెను విధ్వంసమే సృష్టించింది. అయితే కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. అందుకు ఈ లెక్కలే నిదర్శనం.

CSK vs GT- Captain Ruturaj Gaikwad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ పెను విధ్వంసమే సృష్టించింది. అయితే కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం మంచి మార్కులు కొట్టేశాడు. అందుకు ఈ లెక్కలే నిదర్శనం.

గుజరాత్ పరుగుల సునామీకి రుతురాజ్ బ్రేకులు.. ఇది నెక్ట్స్ లెవల్ కంబ్యాక్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో గుజరాత్ టైటాన్స్ విధ్వంసం సృష్టించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు బ్యాటర్లు మైదానంలో పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఎక్కడా కూడా చెన్నై జట్టుకు ఆస్కారం లేకుండా చేశారు. అయితే ఈ విధ్వంసం మరింత కొనసాగాల్సింది. కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రం దానికి బ్రేకులు వేశాడు. ఎంతో తక్కువ అనుభవంతోనే పెను విధ్వాంసాన్ని అడ్డుకున్నాడు. ఎంఎస్ ధోనీ అలా చూస్తూ ఉండిపోగా.. కెప్టెన్ గైక్వాడ్ మాత్రం వ్యూహాలు రచిస్తూ.. గుజరాత్ కు బ్రేకులు వేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కానీ, గుజరాత్ కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. ఓపెనర్లు కెప్టెన్ శుభ్ మన్ గిల్ 104 పరుగులు, సాయి సుదర్శన్ 103 పరుగులతో చెలరేగారు. ఇద్దరు ఓపెనర్స్ శతకాలు నమోదు చేయడం ఐపీఎల్ హిస్టరీలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. అలాంటి దూకుడు మీద ఉన్న గుజరాత్ జట్టుకు చెన్నై బౌలర్లు బ్రేకులు వేయలేకపోయింది. కానీ, కెప్టెన్ గైక్వాడ్ మాత్రం ఎక్కడా ఒత్తిడికి లోనవ్వకుండా ముందుకొచ్చి బౌలర్లను గాడిలోకి తీసుకొచ్చాడు. నిజానికి ఈ దూకుడు చూస్తే స్కోర్ 260 వరకు వెళ్తుందని అంతా అనుకున్నారు. చెన్నై ఫ్యాన్స్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ, గైక్వాడ్ మాత్రం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.

అసలు ఏం జరిగిందంటే.. 15 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ జట్టు 190 పరుగులు చేసింది. ఆ తర్వాత మిగిలిన 5 ఓవర్లలో కనీసం 80 పరుగులు చేస్తారని అంతా భావించారు. కానీ, గైక్వాడ్ మాత్రం ఆ అనర్థం జరగకుండా ఆపేశాడు. ఆఖరి 5 ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు దారిలోకి వచ్చారు. భారీ స్కోర్ రాకుండా కట్టడి చేశారు. ఆఖరి 5 ఓవర్లలో కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఓవర్ల వారీగా చూసుకుంటే.. 16వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. అప్పటికి గిల్, సుదర్శన్ ఇద్దరూ క్రీజులోనే ఉన్నారు. 17వ ఓవర్లో 13 పరుగులు ఇచ్చారు. ఈ ఓవర్లో గిల్, సుదర్శన్ ఇద్దరూ శతకాలు నమోదు చేశారు.

18వ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చి గిల్, సుదర్శన్ ఇద్దరికీ అవుట్ చేశారు. 19వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్లో 12 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ఇలా రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఈ మ్యాచ్ లో మంచి మార్కులు కొట్టేశాడు. మ్యాచ్ ఫలితం గురించి పక్కన పెడితే కెప్టెన్ గా మాత్రం గైక్వాడ్ చాలా పరిణతి ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ ఎందుకు ఎవరికీ సలహాలు, సూచనలు ఇవ్వలేదో అర్థం కాలేదు. మరి.. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ స్కిల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి