iDreamPost
android-app
ios-app

చిరు నుండి మరో చంటబ్బాయి? మెగా ఫ్యాన్స్ బీ రెడీ!

  • Published Nov 25, 2023 | 1:49 PM Updated Updated Nov 25, 2023 | 1:49 PM

తెలుగు ఇంసడ్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అనీల్ రావిపూడి. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అపజయం అన్నది ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు.

తెలుగు ఇంసడ్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు అనీల్ రావిపూడి. దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అపజయం అన్నది ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు.

చిరు నుండి మరో చంటబ్బాయి? మెగా ఫ్యాన్స్ బీ రెడీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి. ఆయన తర్వాత ఇండస్ట్రీలో అపజయం లేకుండా ముందుకు సాగుతున్న దర్శకుడు అనీల్ రావిపూడి. ఒకప్పుడు జంద్యాల, రేలంగి నర్సింహారావు, ఈవీవీ సత్యనారాయణ తర్వాత ఆ స్థాయిలో తనదైన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు అనీల్ రావిపూడి. పటాస్ నుంచి మొదలు మొన్నటి భగవంత్ కేసరి వరకు వరుస హిట్స్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. గతంలో పలుమార్లు మెగాస్టార్ చిరంజీవితో ఛాన్స్ వస్తే మంచి కామెడీ సినిమా తీస్తా అంటూ తన మనసులో మాట చెప్పారు అనీల్ రావిపూడి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

అనీల్ రావిపూడి త్వరలో మెగస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నారని.. ఈ ప్రాజెక్ట్ డిస్కషన్స్ దాదాపు ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు అనీల్ రావిపూడి. త్వరలో నిర్మాత దిల్ రాజు-మెగాస్టార్ మధ్య నెగోషియేషన్స్ పూర్తయితే ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో అనీల్ రావిపూడి మాస్, క్లాస్ రెండూ హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. మాస్ గాడ్ బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టు ‘భగవంత్ కేసరి’ మూవీ తో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఛాన్స్ వస్తే.. తెరపై ప్రేక్షకులు చిరుని ఎలా చూడాలనుకుంటారో అంతకన్నా ఎక్కవగా చూపిస్తా అని అన్నారు.

ఇండస్ట్రీలో యాక్షన్, కమర్షియల్ కన్నా కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అనీల్ రావిపూడి నుంచి చాలా ప్రేక్షకులు చంటబ్బాయి లాంటి గొప్ప ఎంటర్ టైనర్ ని ఆశిస్తుంటారు. ఇప్పుడు చిరంజీవి కోసం ఎలాంటి కథ రాశాడు అన్న విషయంపై ఆసక్తి రేపుతుంది. 1986లో జంద్యాల దర్శకత్వంలో చిరంజీవి, సుహాసిన జంటగా నటించిన ‘చంటబ్బాయ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. మాస్, యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవితో జంద్యాల లాంటి కామెడీ డైరెక్టర్ తీసిన గొప్ప చిత్రంగా ఇండస్ట్రీలో ఈ సినిమా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాలో జేమ్స్ పాండ్ గా చిరంజీవి చేసిన కామెడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా సార్లు చిరంజీవి ఇంటర్వ్యూలో తన కెరీర్ లో ది బెస్ట్ మూవీల్లో ఒకటి చంటబ్బాయ్ అన్న విషయం తెలిసిందే. ఒకవేళ చిరుతో అనీల్ రావిపూడి మూవీ కన్ఫామ్ అయితే.. జంద్యాల తరహా టేకింగ్ చేయగలరా? చంటబ్బాయ్ లాంటి కామెడీ మూవీ ఇవ్వగలరా? అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఒకవేళ అన్నీ కుదిరి ఈ తరహా ప్రాజెక్ట్ ఓకే అయితే.. ఇండస్ట్రీలో చిరంజీవికి మరో బెస్ట్ మూవీ అవుతుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు. మరీ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş