iDreamPost

విమానంతో సమానమైన ఇండియన్ ట్రైన్! కళ్ళు చెదిరే సౌకర్యాలు!

దేశంలో అత్యుత్తమైన వ్యవస్థల్లో రైల్వే ఒకటి. సాతంత్య్రం రాక ముందు నుండి దేశంలో రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పటి పరిస్థితులు, కాలానికి తగ్గట్లు మార్పులు సంతరించుకుంటున్నాయి.

దేశంలో అత్యుత్తమైన వ్యవస్థల్లో రైల్వే ఒకటి. సాతంత్య్రం రాక ముందు నుండి దేశంలో రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్న సంగతి విదితమే. అయితే ఇప్పటి పరిస్థితులు, కాలానికి తగ్గట్లు మార్పులు సంతరించుకుంటున్నాయి.

విమానంతో సమానమైన ఇండియన్ ట్రైన్! కళ్ళు చెదిరే సౌకర్యాలు!

దేశంలో ఒక చోట నుండి మరో చోటకు వెళ్లాలంటే ఉత్తమమైన మార్గం రైల్వే. కొండలు, గుట్టలు, వాగులు, వంకలను దాటుతూ ఎన్నో రాష్ట్రాలు, ప్రాంతాలను కలుపుతున్నాయి రైలు మార్గాలు. అతి పురాతన, పెద్దదైన వ్యవస్థల్లో ఒకటి రైల్వే. అయితే ఇప్పటి పరిస్థితి తగ్గట్లుగా రైల్వే వ్యవస్థలో కూడా మార్పులు సంతరించుకుంటున్నాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల దగ్గర నుండి కొన్ని గంటల్లోనే గమ్య స్థానాలకు చేర్చగలిగే వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసకు వచ్చింది. త్వరలో బుల్లెట్ ట్రైన్ కూడా సిద్ధం కానుంది. సెమీ హై స్పీడుతో ఈ రైలు రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. సాధారణంగా సూపర్ ఫాస్ట్ కేటగిరీ రైళ్లు గంటలకు 90-110 కిలో మీటర్ల నుండి 130 కిలోమీటర్లు ఉంటుంది.

అయితే విమానం వేగంతో దూసుకు వెళ్లే రైలు ఉందని తెలుసా..? అదే తేజాస్ . దేశంలో ఇప్పటి వరకు నడుపుతున్న సెమీ హై స్పీడ్ రైళ్లలో ఇది కూడా ఒకటి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ తేజస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అటువంటి మార్గాల్లో ఒకటి.. దేశ రాజధాని నగరి హస్తీనా (ఢిల్లీ) నుండి ఆర్థిక రాజధాని ముంబయి వరకు తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ పరుగులు పెడుతుంది. ఇది గంటకు 140 కిలో మీటర్ల వేగంతో పట్టాలపై రయ్ మంటూ దూసుకెళుతుంది. ఈ రెండింటి నగరాల మధ్య దూరం 1400 కాగా, కేవలం 7 స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. 15 గంటల్లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. ఇందులో ఆధునిక సౌకర్యాలు ఉంటాయి.

ఆటోమేటిక్ డోర్స్, ఏపీతో పాటు వైఫై, ఎల్ఈడీ టీవీ, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్, చైర్ క్లాస్‌లో స్నాక్స్ టేబుల్స్, మ్యాగజైన్లు, టీ, కాఫీ వెండింగ్ మిషన్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. న్యూ ఢిల్లీ- ముంబై సెంట్రల్ తేజస్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అద్భుతమైన క్యాటరింగ్ సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికులకు వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ రెండు ఎవలబుల్ ఉంటాయి. అలాగే ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. హ్యాండ్ డ్రైయర్‌లు, నీటి స్థాయి సూచికలు, ట్యాప్ సెన్సార్స్, టచ్‌లెస్ వాటర్ ట్యాప్‌లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ డిస్‌ప్లేలు, ఫోన్ సాకెట్‌ వంటివి ఉంటాయి. కళ్లు చెదిరే సదుపాయాలతో ఈ రైలు ప్రయాణిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి