iDreamPost

వైస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

వైస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్

కష్టాల్లో ఉన్న చేనేత కుటుంబాలకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక పథకాన్ని ప్రారంభించింది. అనంతపురం పర్యటనలో భాగంగా ధర్మవరంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేనేత కార్మికుల కుటుంబాలకు దన్నుగా ఉండటానికి నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజున “నేతన్న నేస్తం” పథకాన్ని ప్రారంభించడం విశేషం. ఈ పథకంలో భాగంగా మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.24వేల ఆర్థికసాయం అందజేస్తారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 27,481 మంది చేనేత కార్మికులను ఎంపిక చేసారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఒక చరిత్ర ఉందని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలు తెలుసుకున్నానని, గతప్రభుత్వం చేనేత కార్మికులను పట్టించుకోలేదని,పైగా ఆప్కో పేరుతో చేనేత కార్మికులను దోచుకుందని తెలిపారు.ఆప్కోలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో ఆప్కోను చేనేత కార్మికులను ఉపయోగపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మవరం, చీరాల, వేంకటగిరి,ప్రొద్దుటూరు, మంగళగిరి,చీరాల, ఉప్పాడ, పొందూరు,తిప్పసముద్రం, జమ్మలమడుగు, ఎమ్మిగనూరు ఇలా రాష్ట్రంవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల సంక్షేమం కోసం నేతన్న హస్తం పథకం ప్రారంభిస్తున్నామని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 చేనేత కార్మికులకు లబ్ది చేకూరేలా 196 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ ఒక్క క్లిక్కుతో విడుదల చేసారు. చేనేత కార్మికులు కోసం ప్రారంభించిన నేతన్న నేస్తం పథకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి