iDreamPost

నేను మీకు బాగా కావాల్సినవాడిని రిపోర్ట్

గత వారం బ్రహ్మాస్త్ర మొదటి మూడూ రోజులు హడావిడి చేసి ఆ తర్వాత చల్లారిపోవడంతో ట్రేడ్ ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి.

గత వారం బ్రహ్మాస్త్ర మొదటి మూడూ రోజులు హడావిడి చేసి ఆ తర్వాత చల్లారిపోవడంతో ట్రేడ్ ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి.

నేను మీకు బాగా కావాల్సినవాడిని రిపోర్ట్

Lనిన్న బాక్సాఫీస్ వద్ద మీడియం బడ్జెట్ సినిమాలు సందడి చేశాయి. గత వారం బ్రహ్మాస్త్ర మొదటి మూడూ రోజులు హడావిడి చేసి ఆ తర్వాత చల్లారిపోవడంతో ట్రేడ్ ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. అక్టోబర్ 5 దసరా దాకా చెప్పుకోదగ్గ పెద్ద హీరోల చిత్రాలేవీ లేకపోవడంతో వీటి టాక్ కీలకంగా మారింది. అయితే మూడింటిలో ఏదీ పెద్దగా ఓపెనింగ్స్ తెచ్చుకోకపోవడం విచారకరం. ఆడియన్స్ దేని మీదా ఆసక్తి చూపించలేదు. ఫలితంగా బిసి సెంటర్లలో పరిస్థితి మరీ దీనంగా ఉంది. కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని మీద యూత్ తో పాటు తన ఫ్యాన్స్ లో అంతో ఇంతో అంచనాలున్నాయి. మరి బొమ్మ వాటికి తగట్టుగా ఉందా లేదా రిపోర్ట్ లో చూద్దాం

క్యాబ్ డ్రైవర్ నవీన్(కిరణ్ అబ్బవరం)కు రోజూ సాఫ్ట్ వేర్ ఇంజనీరైన తేజు(సంజనా ఆనంద్)ని పికప్ చేసుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేయడం డ్యూటీ. ఆమె క్రమం తప్పకుండా విపరీతంగా మందు కొట్టడం చూసి అనుమానం వచ్చిన నవీన్ లవ్ ఫెయిల్యూర్ వల్లే ఇలా అయ్యిందని తెలుసుకుని ఓదారుస్తాడు. తల్లితండ్రులకు దూరంగా ఉండటం మంచిది కాదని నచ్చజెప్పి కారులోనే హైదరాబాద్ నుంచి వైజాగ్ కు డ్రాప్ చేస్తాడు. ఈ క్రమంలోనే నవీన్ ప్రేమకథ ఒకటి సంజుకు తెలుస్తుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులే అసలు స్టోరీ. స్క్రీన్ ప్లే సంభాషణలు తనే సమకూర్చుకున్న కిరణ్ అబ్బవరం యాక్టింగ్ పరంగా నిరాశపరచలేదు కానీ రైటింగ్ లో మాత్రం తేలిపోయాడు
Kiran abbavaram
తండ్రి కూతుళ్ళ బాండింగ్ మీద ఒక ఎమోషనల్ లైన్ రాసుకోవడం వరకు బాగానే ఉంది కానీ దానికి అక్కర్లేని అవసరం లేని మాస్ ఎలిమెంట్స్, ఏ మాత్రం నవ్వించలేని కామెడీ ట్రాక్స్ ని సెట్ చేసుకోవడం పూర్తిగా తేడా కొట్టేసింది. మొదలైన అయిదు నిమిషాలకే ఐటెం సాంగ్ పెట్టడంలో ఉద్దేశమేంటో అర్థం కాదు. ఫామ్ తగ్గిపోయిన మణిశర్మ ఇచ్చిన పాటల్లో ఒకటో రెండో తప్ప మిగిలినవి సహనానికి పరీక్ష పెట్టేవే. ఫస్ట్ హాఫ్ ఒకలా, దానికి సంబంధం లేకుండా సెకండ్ హాఫ్ మరోలా దర్శకుడు శ్రీధర్ గాదె తీర్చిదిద్దిన తీరు కనీస అంచనాలను అందుకోలేకపోయింది. హీరోయిన్, ఎస్వి కృష్ణారెడ్డి సహా క్యాస్టింగ్ కూడా పెద్ద మైనస్సే. ఏదీ ఆశించకుండా వెళ్లినా నిరాశపరిచే ఈ కావాల్సినవాడు అందరికీ నచ్చేవాడు కాలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి