iDreamPost

Kiran Abbavaram: ఎల్లుండే ఆ హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్ధం!

  • Published Mar 11, 2024 | 12:43 PMUpdated Mar 11, 2024 | 3:18 PM

Kiran Abbavaram Engagement With Rahasya Gorak: టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మార్చి 13, బుధవారం నాడు నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. వధువు ఎవరంటే..

Kiran Abbavaram Engagement With Rahasya Gorak: టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మార్చి 13, బుధవారం నాడు నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. వధువు ఎవరంటే..

  • Published Mar 11, 2024 | 12:43 PMUpdated Mar 11, 2024 | 3:18 PM
Kiran Abbavaram: ఎల్లుండే ఆ హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం నిశ్చితార్ధం!

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం అయ్యింది. తెలుగు రాష్ట్రాలు వివాహ శోభతో కళకళాడుతున్నాయి. సామాన్యులే కాక సెలబ్రిటీలు కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడుతో ఏడడుగులు నడిచి.. వివాహ బంధంలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. మరో టాలీవుడ్‌ కుర్ర హీరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. త్వరలోనే మూడుముళ్ల బంధంలోకి ఎంటర్‌ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. మరో రెండు రోజుల్లో అనగా బుధవారం నాడు నిశ్చితార్థం చేసుకోనున్నాడు. ఇంతకు ఎవరా కుర్ర హీరో అంటే.. కిరణ్‌ అబ్బవరం. అవును ఈ యంగ్‌ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఎవరి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటించిన కిరణ్.. ఆ తర్వాత ‘రాజావారు రాణీగారు’ అనే చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత అతడికి వరుస ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత చిత్రం ‘ఎస్సార్ కళ్యాణమండపం’తో కూడా మంచి హిట్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్‌ హీరో పెళ్లికి రెడీ అయ్యాడు. బుధవారం నాడు ఎంగేజ్‌మెంట్‌ చేసుకోబోతున్నాడు. వధువు ఎవరో అందరికి తెలుసు. ఎవరంటే.. హీరోయిన్‌ రహస్య గోరఖ్‌. ఎవరో గుర్తుకు రావడం లేదా.. కిరణ్‌ అబ్బవరం తొలి సినిమా రాజావారు.. రాణీగారు లో హీరోయిన్‌. వీరిద్దరికి ఇదే తొలి సినిమా. ఈ చిత్రం షూటింగ్‌ సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. చివరకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే వీరిద్దరూ లవ్‌ బర్డ్స్‌ అంటూ ఎప్పటి నుంచో సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Kiran abbavaram engagment

ఇక గతంలో ఓ షోలో రహస్య గురించి అడిగితే కిరణ్‌ బ్బవరం తెగ సిగ్గుపడ్డాడు. అంతకు ముందు కిరణ్‌ నూతన గృహ ప్రవేశ వేడుకల్లోనూ ఈ బ్యూటీ సందడి చేసింది. ఇన్నాళ్లు సీక్రెట్‌గా లవ్‌ చేసుకున్న వీరు.. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. బుధవారం నాడు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. తర్వలోనే పెళ్లి డేట్‌ ప్రకటించనున్నారు. ఈ విషయం తెలిసి వీరిద్దరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇప్పటికే కిరణ్‌ అబ్బవరం తన సొంతింటి కలను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఆయన తన స్వగ్రామలో సొంతింటిని నిర్మించుకున్నాడు. గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి తెగ వైరల్‌ అయ్యాయి. ఇక ఈ వేడుకకు రహస్య కూడా వచ్చింది. కెరీర్ ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకెళ్లిన కిరణ్‌ అబ్బవరం.. వరుస సినిమాలు చేస్తూ..ఫుల్‌ బిజీగా ఉన్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి