iDreamPost

నయన్ తార క్షమాపణలు.. రెచ్చిపోతున్న అభిమానులు

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మూవీ అన్నపూరణి ఇటీవల థియేటర్లలో మెప్పించలేక.. ఓటీటీలోకి వచ్చింది. ఇది స్ట్రీమింగ్ అయ్యాక.. ఎంతో మంది ఈ సినిమాపై మండిపడ్డారు. చివరకి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ నిలిపివేసింది. అంతలో నయన్..

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన మూవీ అన్నపూరణి ఇటీవల థియేటర్లలో మెప్పించలేక.. ఓటీటీలోకి వచ్చింది. ఇది స్ట్రీమింగ్ అయ్యాక.. ఎంతో మంది ఈ సినిమాపై మండిపడ్డారు. చివరకి నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ నిలిపివేసింది. అంతలో నయన్..

నయన్ తార క్షమాపణలు.. రెచ్చిపోతున్న అభిమానులు

సెన్సార్ బోర్డ్ ఏం చేస్తోంది…..అన్నపూరిణి సినిమా కాంట్రవర్సీ బాగానే దేశంలో కాక పుట్టించింది. ఎప్పుడూ ఏ రకంగానూ స్పందించడమే అలవాటు లేని నయనతార మొదటిసారి హిందూ భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయన్న ఆందోళనను గౌరవిస్తూ, తన ఇన్ స్టా అకౌంట్ ద్వారా క్షమాపణలు చెప్పింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రామజపంతో దద్దరిల్లిపోతున్న క్షణాలలో ఆమె స్పందన కొంత వరకూ అమె పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసింది. ఒకటనుకుని చేస్తే మరొకటి జరిగిందని, తమ అభిప్రాయం ఎవ్వరినీ నొప్పించడం కాదని, కేవలం కథ పరంగా తన పాత్ర నేపథ్యంలో రాసుకున్న కాల్పనికమైన కథగానే అమె వివరణ ధ్వనించింది.

కందకి లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టుగా, నయనతార స్వచ్ఛందంగా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పడం అసంఖ్యాకులలో ఆమెను ఉదాత్తమైన వ్యక్తిగానే చిత్రీకరించింది, కానీ ఆమె అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. నిజానికి తమ అభిమాన కథానాయకి క్షమాపణలు చెప్పవలసిన అవసరమే లేదని పోస్టులతో గొడవకి దిగుతున్నారు. ఒకడైతే నువ్వేం తప్పు చేశావని క్షమాపణ చెబుతున్నావు అని నేరుగా నయనతారనే నిలదీస్తున్నాడు. ఇది తమకి అవమానకరమని, ఈ బాధ్యత తమ హీరోయిన్ ది కానేకాదని వాగ్యుద్ధానికి సిద్ధమవుతున్నారు అభిమాన గణం.
అసలు అంటే గింటే ఈ సినిమాని సెన్సార్ చేసినవారిని అనాలి గానీ, లేదా వాళ్ళు క్షమాపణలు చెప్పుకోవాలి గానీ నయనతారకి ఈ గొడవతో ఏ రకమైనా ప్రమేయం లేదని ఫేన్స్ అల్లరి చేస్తున్నారు.

ఏ మొహం పెట్టుకుని సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిందన్నదే వాళ్ళ ప్రశ్న. ధియేటర్స్ లో విడుదలైన తర్వాతే నెట్ ఫ్లిక్స్ ఓటిటిలోకి సినిమా తెచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, అలాంటప్పుడు నయనతార దీనికి ఎందుకు ఎలా బాధ్యత వహించాలని అబిమానులు పోస్టులు దంచుతున్నారు. నయనతార చుట్టూ ఎన్ని కాంట్రవర్సీలున్నా, ఏ కాంట్రవర్పీకి ఆమె ఎప్పుడు స్పందించిన పాపాన్న పోలేదు. లవ్ అపైర్లు, లివింగ్ టుగెదర్, బాయ్ ఫ్రెండ్ తర్వాత బాయ్ ఫ్రెండు…..వంటి ఎన్నో కాంట్రవర్సీలను తమిళ మీడియాలో నయనతార ఎన్నోసార్లు ఎదుర్కొంది. కానీ అంతా మౌనంగానే నడిపింది.

కానీ ఈసారి ఒక మతానికి, ఒక ఆచారానికి సంబంధించి, కోటానుకోట్ల మంది సెంటిమెంట్స్ ని దెబ్బతీసిందా సినిమా అనే విషయంలో మాత్రం నయనతార నిజాయితీగా క్షమాపణలు చెబుతుంటే, ఇవేమీ పట్టించుకోకుండా అభిమానులు నయనతారమీద వెర్రి అభిమానాన్ని ఒలకబోస్తున్నారు. అబిమానం మాట అటుంచి, అబిమానుల మితిమీరిన చేష్టలు నయనతారకి మరిన్ని తలనొప్పులు తెస్తాయన్నది వాళ్ళు గ్రహించకపోవడం నయనతార బ్యాడ్ లక్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి