iDreamPost

కోవిడ్ పోరాట యోధులకు నేవీ వందనం

కోవిడ్ పోరాట యోధులకు నేవీ వందనం

ఆస్పత్రులపై హెలికాఫ్టర్లతో పూల వాన

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ నుంచి ప్రజలను రక్షించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలు అజారామరం. వందలాది మందికి అవిశ్రాంతంగా స్వు అందిస్తూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగుల ప్రాణాలు కాపాడేందుకు వారు విశ్రాంతంగా పని చేస్తున్నారు..ఈ విపత్కాలంలో వారి సేవలు వెలకట్టలేనివి.బదులు తీర్చుకోలేనివి.అందుకే వారికి దేశం యావత్తు జేజేలు పలుకుతోంది.
నిరంతర పోరాటంలో 24 గంటలు పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఘనంగా వందన సమర్పణ చేస్తోంది వాయుసేన. దేశ వ్యాప్తంగా కరోనా ఆస్పత్రులపై ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పూలవర్షం కురిపించింది.

వైద్య సిబ్బందికి ఎయిర్‌ఫోర్స్‌ ఇస్తున్న అపూర్వ గౌరవం ఇది. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా ఆస్పత్రుల్లోని ప్రతి విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతుంది. విశాఖలో చెస్ట్‌, గీతం ఆస్పత్రి, హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ బలగాల సంయుక్త విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి సంఘీభావంగా సముద్రతీరాల్లో నౌకలు నిలిపిన నేవీ తమ కృతజ్ఞతను చాటుకుంది. ఢిల్లీలోని రాజ్ పద్ రోడ్డులోని ఆస్పత్రి, జ్ శ్రీనగర్లోని దాల్ సరస్సు వద్దనున్న ఆస్పత్రుల పైనా వాయుసేన పూలవాన కురిపించి కృతజ్ఞతలు తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి