iDreamPost

నిమిషాల్లో డ్రోన్ ను నేలమట్టం చేసిన గ్రద్ద.. ఇండియన్ ఆర్మీనా మజాకా!

Eagles To Hunt Illegal Drones : టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అనార్థాలు కూడా పెరిగిపోతున్నాయి. కొంతమంది ఆకతాయిలు డ్రోన్స్ ఎగురవేస్తూ ఆందోళన సృష్టిస్తున్నారు.. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఈగల్ స్క్వాడ్ సరికొత్త ప్రయోగం చేసింది.

Eagles To Hunt Illegal Drones : టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది అనార్థాలు కూడా పెరిగిపోతున్నాయి. కొంతమంది ఆకతాయిలు డ్రోన్స్ ఎగురవేస్తూ ఆందోళన సృష్టిస్తున్నారు.. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఈగల్ స్క్వాడ్ సరికొత్త ప్రయోగం చేసింది.

నిమిషాల్లో డ్రోన్ ను నేలమట్టం చేసిన గ్రద్ద.. ఇండియన్ ఆర్మీనా మజాకా!

ఈ మధ్య కాలంలో డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. సాధారణంగా పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్స్ కి ఫోటో గ్రాఫర్లు డ్రోన్స్ వాడుతున్నారు. కొంతమంది యూట్యూబర్లు డ్రోన్ల సహాయంతో షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు, సంఘ విద్రోహక శక్తులు అనుమతి లేని ప్రదేశాల్లో డ్రోన్స్ ఎగుర వేస్తూ అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేవాలయాలపై డ్రోన్స్ ఎగుర వేయరాదని ఆంక్షలు ఉన్నా.. కావాలని డ్రోన్స్ ఎగుర వేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. అలాంటి వాళ్ల ఆట కట్టించడానికి ఈగిల్ ఆఫ్ తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఇటీవల ఏర్పాట్లు చేసింది. వివరాల్లోకి వెళితే..

శిక్షణ పొందిన డేగలతో అకాశంలో ఎగిరే డ్రోన్ ని కూల్చి వేసే ప్రదర్శన తెలంగాణ పోలీసులు విజయవంతంగా ప్రదర్శించారు. ఇందుకోసం దాదాపు మూడు సంవత్సరాల శ్రమించగా వారి శ్రమకు ఫలితం దక్కిందని అంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటిఎ)లోని సీనియర్ ఐపిఎస్ అధికారులతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా ప్రత్యక్షంగా ప్రదర్శించిన ప్రదర్శనలో ఇద్దరు నిపుణులచే శిక్షణ పొందిన మూడు డేగలను మొదటిసారిగా దేశవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం ఉపయోగించింది. ఈ సందర్భంగా ఐఐటీఏలో 23వ బ్యాచ్ కనైన్స్ ప్రాసింగ్ అవుట్ పరేడ్‌లో ఐపీఎస్ అధికారులు ట్రైనర్‌లను, ఐఐటీఏ అధికారులను అభినందించారు.

ప్రదర్శనలో భాగంగా ఒక షెడ్‌పై కూర్చున్న డేగ అకస్మాత్తుగా ఆకాశంలోకి వెళ్లి అక్కడ ఉన్న డ్రోన్ ని కాలితో పట్టుకొన్ని దాన్ని కిందకు తెస్తుంది.  రెప్పపాటున గద్ద డ్రోన్ ని పట్టుకుని వెనక్కి ఎగురుతుంది.
వీవీఐపీ సందర్శనలు, బహిరంగ సమావేశాలు, అనుమతి లేని ప్రదేశాల్లో ఏదైనా హాని కలిగించే వస్తువులు, డ్రోన్ లను పసిగట్టి గద్దలు వెంటనే వాటిని క్రిందికి లాగగలవు.  ఈగల్ స్క్వాడ్ అంతర్గత భద్రతా విభాగం (ISW)లో భాగం.. ఇది తెలంగాణలో వీవీఐపీ భద్రతను పర్యవేక్షించడానికి  ప్రత్యేకమైన పోలీసు దళం. 2020లో తెలంగాణ పోలీసులు ఈగల్ స్క్వాడ్‌తో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్ట్ కోసం నిధులు కోరుతూ ఆర్థిక శాఖకు హోం శాఖ నుండి లేఖ ఆమోదించబడింది, ప్రత్యేక స్క్వాడ్‌ను రూపొందించడానికి నిర్ణయించింది. ఇది దేశంలో మొదటి ఏకైక ఈగిల్ స్క్వాడ్. మూడు నెలల వయసున్న మూడు డేగ కోడిపిల్లలను మొదట శిక్షణలో చేర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

Eagle distroy drone in sky

ఈ ప్రాజెక్ట్ కోసం స్థానిక హైదరాబాదీ ఎండీ ఫరీద్, కోల్‌కతాకు చెందిన పక్షుల శిక్షకుడు అబీర్ భండారీని నియమించారు. ఈ డేగలు ఆకాశంలో ఎగిరే వస్తువులపై నిఘా ఉంచుతాయి. అనుమానం వచ్చిన వస్తువులను వెంటనే కూల్చివేస్తాయి. ప్రతిరోజూ గంట పాటు గద్దలకు శిక్షణ ఇస్తున్నామని.. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉందని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా నిఘా వ్యవస్థలో ఓ అద్భుత ఆవిష్కరణ జరిగిందన నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి