iDreamPost

సముద్రంలో 40 గంటల పాటు భారత నేవీ ఆపరేషన్‌! 35 మందిని..

  • Published Mar 18, 2024 | 4:28 PMUpdated Mar 18, 2024 | 4:29 PM

ఇండియన్ నేవీ దాదాపు 40 గంటలు కష్టపడి.. సాహసోపేత ఆపరేషన్‌‌‌తో.. అరేబియా సముద్రంలో రెచ్చిపోతున్న సోమాలియా దొంగలను పట్టుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియన్ నేవీ దాదాపు 40 గంటలు కష్టపడి.. సాహసోపేత ఆపరేషన్‌‌‌తో.. అరేబియా సముద్రంలో రెచ్చిపోతున్న సోమాలియా దొంగలను పట్టుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 18, 2024 | 4:28 PMUpdated Mar 18, 2024 | 4:29 PM
సముద్రంలో 40 గంటల పాటు భారత నేవీ ఆపరేషన్‌! 35 మందిని..

అరేబియన్ సముద్రంలో.. సోమాలియా దొంగలు వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తూ.. దోచుకుంటున్న ఘటనలు తీవ్ర ఆందళోనకు గురి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో మాల్టా జెండాతో ఉన్న.. ఒక వాణిజ్య నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. దానిని మిగతా నౌకలపై దాడి చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు భారత నేవీ గుర్తించింది. ఇక తక్షణమే దొంగల ఆట కట్టించేందుకు సిద్ధం అయింది భారత నేవీ. హైజాక్ కు గురైన ఆ వాణిజ్య నౌక అయిన ఎంవీ రుయెన్‌ను విడిపించడానికి.. ఇండియన్ నేవి భారీ ఆపరేషన్ ను చేపట్టింది. ఈ క్రమంలో దాదాపు 40 గంటలు కష్టపడి ఎట్టకేలకు సముద్రపు దొంగలను పట్టుకుంది.

గత ఏడాది హైజాక్ కు గురైన ఈ వాణిజ్య నౌకను రక్షించేందుకు.. మార్చి 16న భారీ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ లో భాగంగా.. ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ సుభద్రలతోపాటు సీ గార్డియన్‌ డ్రోన్లను ఏర్పాటు చేసింది. అలాగే భారత తీరానికి దాదాపు 2600 కి.మీ. దూరంలో వైమానిక దళం ‘సీ-17’ సరకు రవాణా విమానం ద్వారా.. రెండు చిన్నపాటి యుద్ధ బోట్లను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మెరైన్‌ కమాండోస్ ద్వారా.. మొత్తం 35 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బందీలుగా ఉన్న 17 మందిని విడిపించారు. అంతేకాకుండా.. రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రితో ఉన్న నౌకను జాగ్రత్తగా తీరానికి చేర్చుతాం అని కూడా వారు వెల్లడించారు. ఈ ఆపరేషన్ గురించి భారత నౌకాదళం ట్విట్టర్ లో పేర్కొంది.

సోషల్ మీడియా ద్వారా ఇండియన్ నేవి ఈ ఆపరేషన్ గురించి తెలియజేస్తూ.. “మార్చి 15 ఉదయం ఐఎన్ఎస్ కోల్‌కతా.. వాణిజ్య నౌక రుయెన్‌కు సమీపంగా చేరుకుని.. డ్రోన్ ద్వారా సముద్రపు దొంగల ఉనికిని గుర్తించింది. పైరేట్‌లు డ్రోన్‌ను కూల్చివేసి.. భారత నౌకాదళ యుద్ధనౌకపై కాల్పులు జరిపారు.. భారత ప్రధాన భూభాగం నుంచి 2600 కి.మీ. దూరంలోని యాంటీ పైరసీ ఆపరేషన్‌‌ను మార్చి 16న భారత నావికాదళం చేపట్టింది. ఐఎన్ఎస్ సుభద్రను మోహరించి, మెరైన్ కమాండోలను వైమానికదళ విమానం నుంచి దింపి సముద్ర దొంగలను అదుపులోకి తీసుకున్నాం’’ అంటూ నేవి తెలియజేసింది. దీనితో సోషల్ మీడియాలో ఇండియన్ నేవి 40 గంటల పాటు చేసిన రెస్క్యూ ఆపరేషన్ కు.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఇండియన్ నేవి చేసిన ఈ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి