iDreamPost

పెళ్లి చేసుకున్న టీమిండియా పేసర్.. వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు!

  • Author singhj Published - 10:37 AM, Sat - 25 November 23

టీమిండియా స్పీడ్​స్టర్ పెళ్లి చేసుకున్నాడు. అతడి మ్యారేజ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టీమిండియా స్పీడ్​స్టర్ పెళ్లి చేసుకున్నాడు. అతడి మ్యారేజ్​కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Author singhj Published - 10:37 AM, Sat - 25 November 23
పెళ్లి చేసుకున్న టీమిండియా పేసర్.. వైరల్ అవుతున్న మ్యారేజ్ ఫొటోలు!

సెలబ్రిటీలకు ప్రజల్లో ఉండే ఆదరణ, అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్​తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులకు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. వీళ్ల ప్రొఫెషనల్ లైఫ్​తో పాటు పర్సనల్ లైఫ్​కు సంబంధించిన విషయాలు కూడా వార్తల్లో టాపిక్స్​ అవుతుంటాయి. సెలబ్రిటీల లవ్ లైఫ్​, మ్యారేజ్ లైఫ్​పై ఆడియెన్స్​, ఫ్యాన్స్​కు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరు ఎవరితో ప్రేమలో ఉన్నారు? ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నారు? లాంటి న్యూస్​ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక టీమిండియా క్రికెటర్​ మ్యారేజ్​ న్యూస్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అతడి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఆ క్రికెటర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ నవ్​దీప్ సైనీ ఒక ఇంటివాడయ్యాడు. తన ఫ్రెండ్ స్వాతి ఆస్థానాను అతడు వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి రాజస్థాన్ ఉదయ్​పూర్​లోని దేబారి ఆనందం రిసార్ట్స్​లో ఘనంగా జరిగింది. సైనీ, స్వాతీల మ్యారేజ్ పంజాబీ ట్రెడిషన్ ప్రకారం జరిగింది. వీళ్లిద్దరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యారేజ్​కు ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది అతిథులు కూడా హాజరయ్యారు. తన పెళ్లి ఫొటోలను సైనీ ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేశాడు. వీటిని చూసిన అభిమానులు ఈ భారత క్రికెటర్​కు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ కపుల్ చూడటానికి చాలా బాగున్నారని మెచ్చుకుంటున్నారు. త్వరలో టీమిండియాలోకి సైనీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

నవ్​దీప్ సైనీ పెళ్లాడిన స్వాతి ప్రొఫెషనల్ వ్లోగర్ అనేది తెలిసే ఉంటుంది. ఫ్యాషన్, ట్రావెలింగ్, లైఫ్ స్టైల్​పై ఆమె వీడియోలు చేస్తూ యూట్యూబ్​లో పెడుతుంటారు. ఈ వీడియోల ద్వారా ఆమె మంచి పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక, సైనీ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. అతడు 2019లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు. మంచి పేస్, పర్ఫెక్ట్ లెంగ్త్​లో బాల్స్​ సంధిస్తూ బ్యాటర్లను భయపెట్టాడు సైనీ. అతడు మరింత నిలకడతో బౌలింగ్ వేస్తే ఫ్యూచర్​లో స్టార్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే ఇంజ్యురీల కారణంగా టీమ్​కు దూరమయ్యాడీ స్పీడ్​స్టర్. ఆ తర్వాత రీఎంట్రీ ఇద్దామనుకున్నా జట్టులో పోటీ పెరిగిపోవడంతో కమ్​బ్యాక్ చేయడం కుదర్లేదు. రీసెంట్​గా జరిగిన ముస్తాక్ అలీ టోర్నమెంట్​లో ఆడిన సైనీ 7 మ్యాచుల్లో 4 వికెట్లే తీశాడు. ఈ సంవత్సరం అక్టోబర్​లో ఇరానీ కప్​లో రెస్టాఫ్​ ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 30 ఏళ్ల నవ్​దీప్ సైనీ ఆఖరుగా 2021 జులైలో ఇంటర్నేషనల్ మ్యాచ్ (శ్రీలంక మీద) ఆడాడు.

ఇదీ చదవండి: వీడియో: పరువు పోగొట్టుకున్న రమీజ్ రాజా! ఇంతకంటే ఘోరం మరోటి ఉండదేమో?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి