iDreamPost

Paytm కు రిలీఫ్.. UPI పేమెంట్లకు NPCI అనుమతి

పేటీఎంకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్బీఐ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎంకు యూపీఐ పేమెంట్ల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పేటీఎంకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆర్బీఐ ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎంకు యూపీఐ పేమెంట్ల విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Paytm కు రిలీఫ్.. UPI పేమెంట్లకు NPCI అనుమతి

గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం ఏదైనా ఉందంటే అది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించడమే. కేవైసీ నిబంధనలను ఉల్లంఘించి రూల్స్ అతిక్రమించినందుకు ఆర్బీఐ ఆంక్షలు విధించింది. దీంతో పేటీఎం సతమతమైపోయింది. ఇలాంటి తరుణంలో పేటీఎంకు భారీ ఊరట లభించింది. కస్టమర్లు ఎప్పటిలాగే ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆర్‌బీఐ విధించిన ఆంక్షల గడువు మార్చి 15 ముగియనుంది. ఈ గడువు కంటే ఒక రోజు ముందే యూపీఐ పేమెంట్స్ అనుమతులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ యూపీఐ సేవలు అందించేందుకు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ లైసెన్స్ ఇచ్చింది ఎన్పీసీఐ. పలు బ్యాంకులతో ఒప్పందం చేసుకోవడం ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా యూపీఐ సేవలు అందీంచేందుకు ఎన్పీసీఐ అనుమతులు ఇచ్చింది. పేటీఎంకు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంకులుగా యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్ వ్యవహరించనున్నాయి. ఎన్పీసీఐ అనుమతితో ఎప్పటిలాగే యూపీఐ పేమెంట్స్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది. మార్చి 15వ తేదీతో పేటీఎం పేమెంట్ బ్యాంక్ రద్దు కానుండడంతో యూపీఐ లావాదేవీల విషయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి