iDreamPost

యువగళానికి స్పందన కరువు..కిరాయికి కూలీలు!

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు జనం స్పందన కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాత్ర కోసం డబ్బులిచ్చి జనాలను సమీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు జనం స్పందన కరువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాత్ర కోసం డబ్బులిచ్చి జనాలను సమీకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

యువగళానికి స్పందన కరువు..కిరాయికి కూలీలు!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభించిన సంగతి తెలిసిందే. కోనసీమ జిల్లాలోని రాజోల్ లో ఈ పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఈ జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు స్పందన కరువైంది. అసలు జనం లేకపోవడంతో టీడీపీ నేతలు అమోయమంలో పడిపోయారు. ఈ యాత్రతో తమ యువనేతకు  ఎంతో చరిష్మా వస్తుందని భావించిన టీడీపీ నేతలు నిరాశే మిగిలిందంట. జనం రాకపోవడంతో కిరాయి కూలీలను టీడీపీ నేతలు తీసుకొచ్చారు. కిరాయికి వచ్చిన జననానికి అక్కడికక్కడే డబ్బులు పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ నవంబర్ 27న యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం చంద్రబాబు నాయు అరెస్ట్ తో  రెండు నెలల పాటు ఈ పాదయాత్ర నిలిచి పోయింది. చాలా రోజుల విరామం  అనంతరం సోమవారం తిరిగి మొదలైంది.  డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ నుంచి లోకేశ్ తన పాదయాత్రను ప్రారంభించారు.

కోనసీమలో జరుగుతున్న లోకేశ్ పాదయాత్రకు జనం రాకపోవడంతో కిరాయి కూలీలను టీడీపీ నేతలు తీసుకొస్తున్నారని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. కిరాయికి వచ్చిన జనానికి అక్కడిక్కడే డబ్బులు పంపిణీ చేశారు. లోకేశ్ పాదయాత్రకు జనం నుంచి స్పందన కరువు కావడంతో డబ్బులిచ్చి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది స్థానిక టీడీపీ నేతలే వాపోతున్నారు. ఓ చరిష్మా ఉన్న లీడర్ గా లోకేశ్ ను ఎంత ట్రై చేసిన ఎస్టాబ్లిష్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. డబ్బులు ఇచ్చి..జనాన్ని తీసుకొచ్చిన సభ నిండుగా లేదని స్థానికంగా టాక్ వినిపిస్తోంది.

చాలా రోజుల తరువాత పునః ప్రారంభం కావడంతో మొదట టీడీపీ, జనసేన నేతలు పెద్ద ఎత్తున వస్తారని లోకేశ్ భావించారు. కానీ ఓ మాదిరిగా టీడీపీ, జనసేన నేతలు పాదయాత్రకు హాజరయ్యారు. రాజోల్ నుంచి అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించకా జనసేన నాయకులు అయితే ఎవరు కనిపించిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. స్థానికంగా ఉండే జనసేన నేతలు, కార్యకర్తలు  టీడీపీతో కలవలేదని, ఈ నేపథ్యంలో రెండు, మూడు సెంటర్లలో లోకేశ్ మాట్లాడాల్సి ఉన్నా కూడా జనం పెద్దగా లేకపోవడంతో ఏమి మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అంటున్నారు.

ఇదే సమయంలో అమలాపురంలోని గడియా స్తంభం, హైస్కూల్ ప్రాంతం వద్ద జనాల స్పందన అసలు లేదు. దీంతో జనాలను చూపించేందుకు టీడీపీ నేతలు డబ్బులు ఇచ్చి.. జనాలను సమీకరించే ప్రయత్నం చేశారని టాక్ వినిపించింది. ఆ డబ్బులు ఇస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరి.. నారా లోకేశ్ యువగళం… కిరాయి గళం మారిందనంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి