iDreamPost

తాత ఆస్తి 3.87 కోట్లు… మనవడు ఆస్తి 19.42 కోట్లు…

తాత ఆస్తి 3.87 కోట్లు… మనవడు ఆస్తి 19.42 కోట్లు…

వ్యాపారం, రాజకీయాల్లో పారదర్శకతతో ఉండాలని తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గత 9 ఏళ్లుగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నారని, ఆ ఒరవడిని తాను కొనసాగిస్తున్నానంటూ నారా లోకేష్‌ తెలిపారు. ఈ రోజు గురువారం లోకేష తమ కుటుంబ సభ్యుల ఆస్తులను వెల్లడించారు. యువ రక్తం రాజకీయాల్లోకి రావాలనే తాను వచ్చానని చెప్పుకొచ్చారు. తమలా వైఎస్‌ జగన్‌ కూడా తన కుటుంబ సభ్యుల ఆస్తులు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో 500, 1000 నోట్లు రద్దు చేయాలని లేఖ రాసింది తన తండ్రి చంద్రబాబేనని గుర్తు చేశారు.

ఇక నారా లోకేష్‌ ప్రకటించిన ఆస్తులను పరిశీలిస్తే.. తాత చంద్రబాబు కన్నా మనవడు దేవాన్స్‌ ఆస్తులు దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు నికర ఆస్తి 3.87 కోట్లు కాగా దేవాన్స్‌ ఆస్తి 19.42 కోట్లు. కాగా చంద్రబాబు ఆస్తి గతేడాదికి కన్నా 87 లక్షలు పెరిగినట్లు లోకేష్‌ వివరించారు. దేవాన్స్‌ ఆస్తి గతేడాది కన్నా 71 లక్షలు పెరిగింది. నారాభువనేశ్వరి ఆస్తి గతేడాది 31.01 కోట్లు ఉంటే.. ఈ ఏడాది 39.58 కోట్లకు పెరిగింది. తన ఆస్తులు గతేడాది కన్నా 2.40 కోట్లు తగ్గినట్లు లోకేష్‌ తెలిపారు. గతేడాది 21.40 కోట్లుగా ఉన్న తన ఆస్తి ఈ ఏడాది 19 కోట్లకు తగ్గిందని చెప్పారు. నారా బ్రహ్మణీ ఆస్తి పోయిన ఏడాది 7.72 కోట్లు కాగా ఈ ఏడాది 11.51 కోట్లకు పెరిగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి