iDreamPost

YS Jagan: తిట్టిన నోటితోనే వాలంటీర్స్ కి చంద్రబాబు వరాలు! ఇది జగన్ విజయం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన వ్యవస్థల్లో ఒకటి వాలంటీర్ వ్యవస్థ.  దీని ద్వారా ఇంటి వద్దకే వెళ్లి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈవ్యవస్థపై నాడు తిట్టిన టిడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన వ్యవస్థల్లో ఒకటి వాలంటీర్ వ్యవస్థ.  దీని ద్వారా ఇంటి వద్దకే వెళ్లి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు సీఎం జగన్. ఈవ్యవస్థపై నాడు తిట్టిన టిడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

YS Jagan: తిట్టిన నోటితోనే వాలంటీర్స్ కి చంద్రబాబు వరాలు! ఇది జగన్ విజయం!

రాజకీయ చదరంగంలో విజయం సాధించాలంటే అంత ఆషామాషి కాదు. ప్రత్యర్థి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేస్తూనే వారిని ఇరుకున పెట్టే  ప్రయత్నం చేయాలి. అంతేకాక పదునైన వ్యూహాలు, ప్రణాళిలతో ప్రత్యర్థి నుంచి ప్రశంసలు అందుకోవడమే అసలు సిసలైన రాజకీయం. అలా తన పాలన గురించి ప్రత్యర్థుల చేత పొగడ్తలు పొందే పొలిటికల్ సూపర్ స్టార్ లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాటివారిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు. వాలంటీర్ వ్యవస్థపై దుష్పచారం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేతనే అదే వ్యవస్థను ప్రశంసించేలా సీఎం జగన్ చేశారు. ఇది కదా అసలైన రాజకీయ నాయడుకు వ్యూహం అంటే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన వ్యవస్థల్లో ఒకటి వాలంటీర్ వ్యవస్థ.  దీని ద్వారా ఇంటి వద్దకే వెళ్లి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు సీఎం జగన్. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. అంతేకాక భిక్షాటనం చేసినట్లు అడుకునే పరిస్థితి ఉండేది. అలాంటి స్థితి నుంచి ప్రభుత్వ పథకాలు అందుకోవడం  తమ హక్కు అని, అందించడం ప్రభుత్వ బాధ్యత అనేలా సీఎం జగన్ చేసి చూపారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రభుత్వం అందించే అన్నిపథకాలను ఇంటి వద్దకే వెళ్లి.. అర్హులైన వారి దరఖాస్తు వాలంటీర్లు  చేసేవారు. అలా ఫించన్, అమ్మఒడి, రైతు భరోసా వంటి అనేక పథకాలను అర్హులైన అందరికి వాలంటీర్ వ్యవస్థ ఎంతో సక్సెస్ ఫుల్ గా అందిస్తుంది. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రతి నెల మొదటి తారీఖ్ నే ఇంటికి వచ్చి మరీ పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారని లబ్ధిదారులు సంతోషంగా చెబుతున్నారు.

ఇలా ప్రజలు వాలంటీర్ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తే.. కొన్నాళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం.. అనేక అసత్య ఆరోపణలు చేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వ్యక్తి సమాచారం చోరీ చేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని అసత్య ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ఒంటరి మహిళ వివరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. అలానే ఇంట్లో ఎవరు లేని సమయంలో వాలంటీర్ లు వెళ్తున్నారంటూ కూడా ఆరోపణలు కురిపించారు ప్రజలను పీడించే ఏ వాలంటీర్ ను కూడా వదిలిపెట్టను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

ఇక సీన్ కట్ చేస్తే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వాలంటీర్ వ్యవస్థపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. ఇటీవలే పల్నాడు జిల్లాలో నిర్వహించిన ఓ సభలో ప్రసంగిస్తూ.. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, ఇప్పుడు ఉన్నదాని కంటే.. ఇంకా బెటర్ గా ఈ  వ్యవస్థను మారుస్తానంటూ చెప్పుకొచ్చారు. అలానే వాలంటీర్లకు రూ.10వేల  పారితోషకం ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై సామాన్య ప్రజలతో సహా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాడు వాలంటీర్ వ్యవస్థపై దారుణమైన నిందలు వేసిన బాబు.. ఒక్కసారిగా ఇలా ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపించడం ఏంటని అభిప్రాయా పడుతున్నారు.

ఇలా వాలంటీర్ వ్యవస్థను తిట్టిన చంద్రబాబు నోటితోనే ప్రశంసించేలా చేయడం సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయం అని రాజకీయ విశ్లేషకులు ఉంటున్నారు. అలా సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను విమర్శించిన చంద్రబాబే వాటిని కొనసాగిస్తామని చెప్పడం కూడా  సీఎం జగన్ విజయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ని ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నామన్నది ముఖ్యంగా కాదు..ఎలాంటి మార్క్ వేశామనిది ముఖ్యం, అలాంటి ప్రత్యేకమైన గుర్తింపును పొలిటికల్ సూపర్ స్టార్ సీఎం వైఎస్ జగన్ సాధించారని సామాన్య ప్రజలు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి