iDreamPost

Nagarjuna: నాగార్జున చైన్ ఎఫెక్ట్ కి తిరుగులేదు

సంక్రాంతి బరిలో నా సామి రంగా అంటూ నిలిచారు అక్కినేని హీరో నాగార్జున. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమా.. కలెక్షన్ల విషయంలో కూడా అదే దారిలో పయనిస్తోంది. ఆ వివరాలు..

సంక్రాంతి బరిలో నా సామి రంగా అంటూ నిలిచారు అక్కినేని హీరో నాగార్జున. పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న సినిమా.. కలెక్షన్ల విషయంలో కూడా అదే దారిలో పయనిస్తోంది. ఆ వివరాలు..

Nagarjuna: నాగార్జున చైన్ ఎఫెక్ట్ కి తిరుగులేదు

ఓ పని విజయవంతంగా పూర్తయినప్పుడు వెనుకనుండి చక్రం తిప్పాడంటారు సాధారణంగా. కానీ అక్కినేని నాగార్జున విషయంలో మాత్రం తెర ముందునే ఉండి చైన్ తిప్పాడని అనాలి. మొన్న సంక్రాంతికి విడుదలైన నా సామిరంగా సినిమా అక్కినేని నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ ని అన్నివిధాల నిలబెట్టింది. ఎప్పుడూ మౌనంగా కనిపించే చిత్రనిర్మాత శ్రీనివాసా చిట్టూరి సంక్రాంతిబరిలోకి దిగి జెండా ఎగరేశారు. కేవలం మూడు నెలల కాలంలో చిత్రనిర్మాణాన్ని పూర్తి చేసి, ఎక్కడా ఎవ్వరినీ నొప్పించకుండా సజావుగా షూటింగ్ కార్రక్రమాలను పూర్తి చేసి, సంక్రాంతికి నా సామిరంగాని పందెం కోడిని వదిలినట్టుగా వదిలారు చిట్టూరి.

దర్శకుడు విజయ్ బిన్ని ఈ క్రెడిట్ నంతా థాంక్స్‌ గివింగ్ మీట్ లో తన యూనిట్ కే అందించాడు. తనకున్నలాటి డెరెక్షన్ టీం ఎవరికున్నా ఇంతే స్పీడుగా పూర్తి చేయగలుగుతారు అని చెప్పి టీంకి థాంక్స్ చెప్పాడు. తీయడమంటే తీశారు, విడుదలంటే చేశారు గానీ నా సామిరంగా మూడు హైలీ ఎక్సెపెక్ట్ డ్ సినిమాలతో పాటు పోటీకి దిగింది. అదీ ఇందులో ఆసక్తికరమైన విషయం.

nagarjuna naa saami ranga

హనుమాన్, గుంటూరు కారం ముందు విడుదల కాగా, తర్వాత సైంధవ్, దాని వెంట నా సామిరంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగింటిలో పాజిటివ్ టాక్ తో కాలరెత్తుకున్న సినిమాలు హనుమాన్ అండ్ నా సామిరంగా. డే వన్ రోజునే ఈ రెండు సినిమాలకి హిట్ టాక్ వచ్చేసింది. అలాగే ఈ రెండు సినిమాటీంలే మీడియా ముందుకు గుండె నిబ్బరంతో వచ్చి, తమ సక్సెస్ ను హైలైట్ చేసుకోగలిగాయి.

హిట్ టాక్ ఊరికే రాదు ఏ సినిమాకి. అందులో అంత దమ్ముంటేనే హిట్ సాధ్యమవుతుంది. నా సామిరంగా కథే సంక్రాంతి సీజన్లో కథ. దానికి అనువుగా వాతావరణం, కథనం అద్భుతంగా సాగాయి. వీటిని మించి నాగార్జున స్టయిల్ అంటే బీడీ కాల్చడం నుంచి, డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో నా సామిరంగా అని పలకడం, యాక్షన్ సీక్వెన్స్ ల్లో వీరగా ఫైట్ చేయడం.. ఇవన్నీ ఈ సినిమాకి నాగార్జున పోసిన ఫ్రాణాలు.

అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒకటి బాగా పండింది. నరేష్ పెరఫారమెన్స్ మరో పెద్ద ప్లస్ పాయంట్. దీంతో మొత్తానికి దుమ్ము లేచిపోయింది. మొదటి మూడు రోజులలోనే పెట్టుబడిలో డెబ్భై శాతం రికవర్ అయిపోయిందంటే ఈ రోజుల్లో మాటలు కాదు. మహా గొప్ప. వరల్డ్ వైడ్ థియేట్రికల్ మొత్తం 18కోట్లుగా అంచనా. బాక్సాఫీసు షేరే దాదాపుగా 15 కోట్లు ప్లస్ అని పరిశ్రమంతా ప్రసంశిస్తోంది.

ఎవరో కొందరు అశనిపాతం మాటలు అనొచ్చు. పండగ తర్వాత చూడాలి. నిలబడుతుందో లేదో కనిపెట్టాలి….ఇలాటి ప్రచారం జరుగుతూనే ఉంటందనుకోండి. బట్….ఒక్కసారి సినిమాకి పాజిటివ్ బజ్ వచ్చి, హిట్ టాక్ వస్తే పండగ తర్వాత చూద్దామనుకున్నవాళ్ళు, పండగల్లో చూడలేకపోయినవాళ్ళు లెక్కలేనంతమంది ఉంటారు. వారందరికీ నా సామిరంగా రన్ పెద్ద అవకాశం. మొత్తానికి సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, ఇప్పుడు నా సామిరంగా వరస సంక్రాంతి విజయాలతో అక్కినేని నాగార్జున స్వైరవిహారం చేశారనే చెప్పాలి. చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి ఆ క్రెడిట్ దక్కాలి. దక్కింది కూడా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి