iDreamPost

కింగ్ నాగార్జున ధరించిన స్వెట్‌ షర్ట్‌ ధర తెలిస్తే ఔరా అంటారు!

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఈ సీజన్ కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఈ సీజన్ కి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

కింగ్ నాగార్జున ధరించిన స్వెట్‌ షర్ట్‌ ధర తెలిస్తే ఔరా అంటారు!

టెలివిజన్ రంగంలో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో ఎంతో పాపులర్ అయిన బిగ్ బాస్ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తుంది. తెగులు లో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయగా, 2 వ సీజన్ కి నాని హూస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఆయనే హూస్ట్ గా కొనసాగుతున్నారు. స్టార్ మా ఛానల్ లో వస్తున్న బిగ్ బాస్ 2023, సెప్టెంబర్ 6న ప్రారంభం అయ్యింది. ఈసారి బిగ్ బాస్ అంతా ఉల్టా.. ఫుల్టా అంటూ రసవత్తరంగా కొనసాగుతుంది. ఇక వీకెండ్స్ లో అక్కినేని నాగార్జున చాలా స్టైలిష్ లుక్ తో సందడి చేస్తుంటారు. ఆయన వేసుకునే బ్రాండెడ్ దుస్తులపై ప్రతిసారి సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతుంటాయి. తాజాగా ఇటీవల ఆయన ధరించిన ఓ టీషర్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఆరు పదులు దాటినా ఇప్పటికీ నవ మన్మధుడిగా కనిపిస్తుంటారు అక్కినేని నాగార్జున. ముఖంపై ఎప్పుడు చిరునవ్వు.. ఎంతో స్లిమ్ గా స్టైలిష్ లుక్ తో కనిపిస్తారు. ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిగ్ బాస్ రియాల్టీ షోకి హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 నడుస్తుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ అంతా ఉల్టా.. ఫుల్టా కనుక ఐదో వారంలో వైల్డ్ కార్డు ద్వారా నైనా పావని, అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలే శావళి, అశ్విని కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. గత వారం డబుల్ ఎలిమినేషన్ సందర్భంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అశ్వని ఎలిమినేషన్ అయ్యింది. వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన అర్జున్ ఒక్కడ మిగిలిలాడు. బిగ్ బాస్ ఇప్పటి వరకు పన్నెండు వారాలు పూర్తి చేసుకొని పదమూడ వారవ నడుస్తుంది. ఇక శని, ఆదివారం నాగార్జున ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతూ.. ఇంటి సభ్యులను ఎలిమినేషన్ చేస్తుంటారు.

వీకెండ్స్ లో వచ్చే కింగ్ నాగార్జున బ్రాండెడ్ దుస్తులు ధరించి చాలా స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. గతంలో ఆయన ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తెగ వార్తలు సందడి చేశాయి. మొన్నటి వారం ఆయన ధరించిన లూయిస్ విట్టన్ స్వెట్‌షర్ట్ లో ఎంతో స్టైల్ గా కనిపంచారు. ఈ డ్రెస్ లో ఆయన మరింత యంగ్ గా కనిపించారు. అయితే స్వెట్ షర్ట్ ధర గురించి తెలిసి అవాక్కవుతున్నారు. ఇది లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన ‘ఇంటార్సియా కాష్మెరె పూల్ క్రూనెక్’ స్వెట్ షర్ట్. దీని ఖరీదు మార్కెట్ లో రూ.1.82 లక్షలు ఉన్నట్లు ప్రముఖ ఇన్‌స్టా పేజ్ ‘సెలబ్రిటీస్ అవుట్‌ఫిట్ డీకోడ్’ షేర్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మరి కింగ్ నాగార్జునా? మజాకా అంటున్నారు. ఈ స్వెట్ షర్ట్ కాశ్మీరీ స్వచ్చమైన ఉన్నితో తయారు చేస్తారు. కాగా, లూయిస్ విట్టన్ అనేది ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్. ఇక నాగార్జున సినీ విషయానికి వస్తే.. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున ‘నాసామి రంగ’మూవీలో నటిస్తున్నారు. అషికా రంగనాథన్, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ చిట్టూరీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ ధరించిన స్వెట్ షర్ట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ లో ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి