iDreamPost

“టిల్లు స్క్వేర్‌” సూపర్ సక్సెస్ తో “టిల్లు క్యూబ్” కూడా సెట్! నిర్మాత క్లారిటీ!

  • Published Mar 30, 2024 | 12:28 PMUpdated Mar 30, 2024 | 12:28 PM

డీజే టిల్లు సినిమా ప్రేక్షకులలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో.. మార్చి 29న టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు క్యూబ్ అంటే పార్ట్ -3 గురించి కూడా .. కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరిగాయి. అవేంటో చూసేద్దాం.

డీజే టిల్లు సినిమా ప్రేక్షకులలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తో.. మార్చి 29న టిల్లు స్క్వేర్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు క్యూబ్ అంటే పార్ట్ -3 గురించి కూడా .. కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరిగాయి. అవేంటో చూసేద్దాం.

  • Published Mar 30, 2024 | 12:28 PMUpdated Mar 30, 2024 | 12:28 PM
“టిల్లు స్క్వేర్‌” సూపర్ సక్సెస్ తో “టిల్లు క్యూబ్” కూడా సెట్! నిర్మాత క్లారిటీ!

ప్రేక్షకులను తన వినూత్నమైన డైలాగ్ డెలివరీతో నవ్వించడానికి.. సిద్దు జొన్నలగడ్డ ఎప్పుడు ముందుంటాడు. ఈ క్రమంలో డీజే టిల్లు సినిమాకు వచ్చిన క్రేజ్ కారణంగా.. మార్చి 29న “టిల్లు స్క్వేర్” వచ్చేసింది. ఇక ఈ సినిమాలో ఉన్న డైలాగులతో ఈసారి థియేటర్ లో నవ్వులు, దద్దరిల్లి పోయాయి అని చెప్పి తీరాలి. మొదటి పార్ట్ కు రెండవ పార్ట్ కు దర్శకుడు మారినా కానీ.. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ.. కథను ముందుకు తీసుకువెళ్లిన విధానంలో మాత్రం.. దర్శకుడు ఎక్కడా రాజీ పడలేదు. బెస్ట్ సిక్వెల్ ఎవర్ అంటూ.. మీడియా , సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ సినిమా మీద ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో టిల్లు క్యూబ్ అంటే.. పార్ట్-3 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరిగాయి. మరి, టిల్లు క్యూబ్ నిజంగానే ఉండబోతుందా ! దీని గురించి చూసేద్దాం..

టిల్లు స్క్వేర్ సినిమాకు.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. కాగా,ఈసారి సిద్ధుకు జోడిగా.. అనుపమ పరమేశ్వరన్ అదరగొట్టేసిందంటూ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిర్మాత నాగవంశీ.. సాయి సౌజన్య కలిసి నిర్మించారు. అయితే, ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించడం మాత్రమే కాకుండా.. కొంతమేరకు స్క్రిప్ట్ ను కూడా రాశాడు. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ సూపర్ సక్సెస్ గా రన్ అవుతూ ఉండడంతో.. సిద్ధు జొన్నలగడ్డ దీనిపై స్పందిస్తూ “డీజే టిల్లు తీస్తున్నపుడే..నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాను తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో దానికి సిక్వెల్ గా వచ్చిన “టిల్లు స్క్వేర్” విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమాను ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు. నేను ఈ సినిమాకు నటుడిగా కంటే ముందు.. రచయితను.. ఎంతో నిజాయితీగా ఉండేలా ఈ కథను రాశాను.

అంతేకాకుండా నిజానికి అనుపమను వంద శాతం ఊహించి ఈ కథ రాస్తే .. తన నటనతో వెయ్యి శాతం “టిల్లు స్క్వేర్ “లో ప్రభావం చూపించింది. అంటూ చెప్పుకొచ్చారు సిద్ధు . ఇక నిర్మాత నాగవంశీ కూడా.. “ఈరోజు మార్నింగ్ షో నుంచి.. మ్యాట్నీ వరకు వచ్చిన గ్రోత్ ని బట్టి చూసుకుంటే.. వచ్చే వారం ఉగాది, రంజాన్ కూడా వస్తున్నాయి కాబట్టి.. ఇక ఏప్రిల్ లో కూడా రిలీజ్ అయ్యే సినిమాలు లేవు కాబట్టి .. టిల్లు స్క్వేర్ 100 కోట్ల గ్రాస్ చేస్తదని ఎస్టిమేషన్ నాకు”.. అంటూ చెప్పుకొచ్చారు. అలాగే టిల్లు క్యూబ్ గురించి అడుగగా.. త్వరలోనే టిల్లు పార్ట్-3 కు సంబంధించిన విషయాలను కూడా అనౌన్స్ చేస్తామని చెప్పుకొచ్చారు. అంటే టిల్లు పార్ట్ -3 ఖచ్చితంగా ఉండబోతుందన్న మాట. దీనిని బట్టి చూస్తే టిల్లు మ్యానియా ఇంకా కొనసాగేలా ఉంది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి