iDreamPost

దూత 2 పై హింట్ ఇచ్చిన నాగ చైతన్య

  • Published Mar 21, 2024 | 12:43 PMUpdated Mar 21, 2024 | 12:43 PM

అయితే ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో దూత 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో దూత సీజన్ 2 గురించి హింట్ ఇచ్చారు. దూత టీమ్‌తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ త్వరలో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో రాశారు.

అయితే ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో దూత 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో దూత సీజన్ 2 గురించి హింట్ ఇచ్చారు. దూత టీమ్‌తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ త్వరలో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో రాశారు.

  • Published Mar 21, 2024 | 12:43 PMUpdated Mar 21, 2024 | 12:43 PM
దూత 2 పై హింట్ ఇచ్చిన నాగ చైతన్య

టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం సాయి పల్లవికి జోడీగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం తండేల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి ముందు మొట్టమొదటి వెబ్ సిరీస్ దూతతో ఓటీటీలో మంచి సక్సెస్ ను చూశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ ఆసక్తికరమైన హారర్-థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఇక ప్రేక్షకులు దూత సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు, దూత సీజన్ 2 రానుందని గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.

అయితే ఇటీవల జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్ లో దూత 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అక్కినేని అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు కూడా నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు నాగ చైతన్య లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో దూత సీజన్ 2 గురించి హింట్ ఇచ్చారు. దూత టీమ్‌తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేస్తూ త్వరలో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో రాశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, త్వరలోనే దూత 2 అధికారిక అప్‌డేట్ విడుదల కానుందని తెలుస్తోంది. ఈ సీరీస్ లో పార్వతీ, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అభిరుచి, ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్ జానర్‌లో ’13బి’ అనే సినిమాలో అద్భుతమైన పనితనం చూపించారు. అలానే అక్కినేని కుటుంబంతో తీసిన ‘మనం’ సినిమాలో అధ్భుతమైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నారు. విక్రమ్ కుమార్ – నాగ చైతన్య కాంబోలో వచ్చిన థాంక్యూ పరాజయం పాలైనా ఆ తరువాత వచ్చిన వెబ్ సిరీస్ “దూత” తో అందరి దృష్టిని ఆకర్షించారు.

Naga Chaitanya gave the hint on Doota 2

ఈ సీరీస్ లో నాగ చైతన్య సమాచార్‌ పత్రిక ఎడిటర్ అయిన సాగర్ వర్మగా నటించారు. అనుకోని పరిస్థితుల్లో భవిష్యత్తులో జరగబోయే హత్యల వివరాలు చిన్న పేపర్ కట్స్ రూపంలో సాగర్ చూస్తాడు. ఆ పైన సాగర్ వర్మ నెమ్మదిగా ఆ పేపర్ మర్డర్లకు సాక్షిగా మారతాడు. ఆ హత్యల వల్ల అతని కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడుతుంది. 1962లో జరిగిన సంఘటనలకు, సాగర్ జీవితానికి ఉన్న లింక్ చూపిస్తూ సాగిన దూత వెబ్ సిరీస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక దూత సీజన్ 2 లో ఎలాంటి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయో, ఎప్పుడు ఈ సీక్వెల్ గురించి అప్డేట్ వస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ చైతన్య లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తో వారి ఎదురుచూపులకు తొందర్లోనే తెర పడేట్లుగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి