iDreamPost

OTT బాటలో విక్టరీ మూవీస్

OTT బాటలో విక్టరీ మూవీస్

ఇప్పుడీ వార్త నిజమైతే మాత్రం థియేటర్ల పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా మారబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఒకపక్క లాక్ డౌన్ తీసేసి ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నప్పటికీ ఎగ్జిబిటర్లకు నిర్మాతలకు ధైర్యం చాలడం లేదు. థర్డ్ వేవ్ ప్రచారం నేపథ్యంలో అసలు సగం సీట్లయినా నిండుతాయా లేదా అనే అనుమానం వాళ్ళ మెదళ్లను తొలిచివేస్తోంది. అందుకే రెండు నెలలు ఊరికే ఉన్నప్పటికీ నిర్మాతలు మెల్లగా ఒక్కొక్కరుగా ఓటిటిల వైపు అడుగులు వేస్తున్నారు. పెట్టుబడులు గ్యారెంటీగా వెనక్కు రావడానికి ఇదొక్కటే మార్గడం కావడంతో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇటీవలే నితిన్ మాస్ట్రో ఈ రకంగానే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసింది.

ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం వెంకటేష్ నటించిన రెండు సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కే రావొచ్చని ఫిలిం నగర్ టాక్. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందిన నారప్పను ప్రైమ్ కు, దృశ్యం 2ని హాట్ స్టార్ కు ఇచ్చారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ రెండు డీల్స్ వల్ల నిర్మాత సురేష్ బాబుకు సుమారు 70 కోట్ల దాకా వర్కౌట్ అయినట్టు సమాచారం. ఇందులో శాటిలైట్ డబ్బింగ్ లు కలపలేదు. ఒకవేళ కొద్దిరోజుల్లో థియేటర్లు తెరిచినా కూడా ఇంత మొత్తం ఈ రెండు సినిమాలు షేర్ రూపం వసూలు చేయడం అంత సులభం కాదు. యావరేజ్ లేదా ఫ్లాప్ టాక్ వస్తే సగం కూడా రాదు. అందుకే సురేష్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారట

ఇదంతా ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ నిజమని నిర్ధారించలేం కానీ నిప్పు లేనిదే పొగరాదుగా. అందుకే ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. సీనియర్ నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా అపార అనుభవం ఉన్న సురేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని పంపిణీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా సినిమా అనేది బిజినెస్ అని మన డబ్బులు సేఫ్ అవుతున్నాయా లేదా అనేది మాత్రమే చూసుకోవాలని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ రెండు సినిమాల్లో ఒక్కటి డైరెక్ట్ ఓటిటి అయినా కూడా నలుగురు సీనియర్ స్టార్లలో మొదటి సారి వెంకీ డిజిటల్ బాట పట్టినట్టు అవుతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి