iDreamPost
android-app
ios-app

దేవిశ్రీ ప్రసాద్‌ ఇంట శుభవార్త.. తండ్రైన సింగర్‌ సోదరుడు

  • Published Feb 23, 2024 | 9:40 AM Updated Updated Feb 23, 2024 | 9:52 AM

Singer Sagar: టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా సాగర్ సంబంధించి ఓ శుభవార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..

Singer Sagar: టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ గురించి అందరికి తెలిసిందే. అయితే తాజాగా సాగర్ సంబంధించి ఓ శుభవార్త అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..

  • Published Feb 23, 2024 | 9:40 AMUpdated Feb 23, 2024 | 9:52 AM
దేవిశ్రీ ప్రసాద్‌ ఇంట శుభవార్త.. తండ్రైన సింగర్‌ సోదరుడు

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికి తెలిసిందే. తన ఆద్భుతమైన సంగీతంతో సినీ ప్రియలును మంత్రముగ్ధులను చేస్తారు. అసలు సినిమాకి తన స్వరాన్ని అందించరనడం కంటే ప్రాణం పెడతారని చెప్పావచ్చు. ఇక ఆయన తమ్ముడు సాగర్ కూడా ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అన్న దేవీశ్రీ ప్రసాద్ డైరెక్షన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు సాగర్ పాటలు పాడారు. అలాగే అన్నయ్య దేవీ శ్రీ ప్రసాద్ లాగే ఈయన కూడా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ కు సంబంధించి ఓ శుభవార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్.. ఇంట పండగ వాతవరణం నెలకొంది. ఎందుకంటే.. తాజాగా సాగర్  ఆయన సతిమణి మౌనిక తల్లిదండ్రులు అయ్యారు. కాగా, సాగర్ 2019లోని ప్రముఖ డాక్టర్ అయిన మౌనికను పెళ్లి చేసుకున్నారు. కాగా, మౌనిక ఈనెల అనగా ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి తన సోషల్ మీడియా ఖాతాలో విషేస్ చెపుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు దేవీ శ్రీ ప్రసాద్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాంక్షాలు తెలియజేస్తున్నారు. కాగా, గతంలో కూడా ఈ జంటకు ఒక మగ బిడ్డ పుట్టగా.. ఇప్పుడు ఇది రెండో సంతానం అని తెలుస్తుంది.

ఇక సాగర్ అన్న దేవీ శ్రీ ప్రసాద్ డైరెక్షన్ లో.. ఆర్య, నేను లోకల్, జనతా గ్యారేజ్, బొమ్మరిల్లు, జులాయి, డీజే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు పాటలు పాడారు సాగర్. అయితే సాగర్ పాడిన డీజే చిత్రంలోని ‘బాక్స్ బద్దలైపోద్ది’ సాంగ్ ఆర్య సినిమాలో ‘నువ్వుంటే నిజమేగా సత్యం’, వర్షం సినిమాలోని ‘నీటి ముళ్లై నన్ను గిల్లు,’ జనతా గ్యారేజ్‌లో ‘నేను పక్కా లోకల్’ వంటి సాంగ్స్ మంచి మ్యూజికల్ సాంగ్స్ గా పేరు తీసుకువచ్చాయి.

కాగా, ఈ వార్త తెలిసిన దేవీ శ్రీ ప్రసాద్ అభిమానులు సాగర్ కి శుభంకాక్షలు తెలిపడమే కాకుండా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ఉన్న దేవీ ఇంకా పెళ్లి చేసుకోలేదని తెగ బాధ పడుతున్నారు. అయితే ప్రస్తుతం 44 ఏళ్ల వయసు ఉన్న దేవీశ్రీ ప్రసాద్ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటారేమో చూడాలి. ఇక దేవిశ్రీ ప్రసాద్ చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘పుష్ప 2,’ ‘తండేల్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘కంగువ’, ‘రత్నం’, ధనుష్-శేఖర్ కమ్ముల సినిమా ఉంది. మరి పుష్ప 2 సినిమాతో గ్లోబల్ వైడ్ గా తన సత్తా ను చాటుతరని ఆయన ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. మరి, దేవీశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ ఇంట మరో బిడ్డ రాక పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş