iDreamPost

టెన్షన్లలో అభ్యర్థులు, ఫలితాల కోసం ఎదురుచూపులు

టెన్షన్లలో అభ్యర్థులు, ఫలితాల కోసం ఎదురుచూపులు

ఎన్నికలు ముగిశాయి. పంచాయితీ ఎన్నికలయితే పోలింగ్ ముగిసిన అరగంటకే ఫలితాలు వెల్లువ మొదలయ్యింది. పెద్ద టెన్షన్ ఉండదు. కానీ ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత మాత్రమే కౌంటింగ్ కి గడువు పెట్టడంతో అభ్యర్థులు ఆతృతగా కనిపిస్తున్నారు. తమ భవితవ్యం ఏమయ్యిందన్నది తెలుసుకోవడానికి తహతహలాడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈనెల 14న ఫలితాలు వెలువడే వరకూ అభ్యర్థులతో పాటుగా వారి అనుచరులతో పాటు అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది.

ఈనెల 10న పోలింగ్ ముగిసింది. దానికి ముందు పలువురు అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు. విజయం కోసం అనేక రూపాల్లో ప్రయత్నించారు. ముఖ్యంగా మునిసిపల్ ఎన్నికలు నామినేషన్లు ప్రక్రియ ముగిసిన తర్వాత గత ఏడాది ప్రక్రియ హఠాత్తుగా నిలిచిపోయింది. నాటి నుంచి అభ్యర్థులకు నిత్యం ఎదురుచూపులే.. మళ్లీ ఎన్నికల నిర్వహణ ప్రారంభమయ్యే వరకూ వివిధ రూపాల్లో ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దానికి పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన వారు కూడా ఉన్నారు. దాంతో ఇదంతా అభ్యర్థులకు తలకుమించిన భారం అయ్యింది.

Also Read : అందరి దృష్టి ఆ రెండు నగరాలపైనే, చివరకు ఏం జరుగుతుంది?

చివరకు ఎన్నికల ప్రక్రియ పునః ప్రారంభమయిన తర్వాత ఈ మార్చి నెల నుంచి పది రోజులకే పెద్ద మొత్తంలో వెచ్చించిన అభ్యర్థులున్నారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు మారిపోవడంతో కొందరు తమ స్థాయికి మించి వ్యయం చేసిన వారు కూడా ఉన్నారు. దాంతో అభ్యర్థులకు మరింత టెన్షన్ ఏర్పడుతోంది. తమ పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన తర్వాత విజయం వరిస్తే కొందరికి ఉపశమనం గానీ లేదంటే మరింత భారం అవుతుందనే ఆందోళన చాలామందిలో కనిపిస్తోంది. అదే సమయంలో మునిసిపల్ చైర్మన్, మేయర్ పదవుల రేసులో ఉన్న వారు మరింత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు

ఎన్నికల సంఘం కూడా వేగంగా పాలకవర్గ ప్రమాణస్వీకారాలకు సిద్ధం అవుతోంది. మేయర్ ఎంపిక ప్రక్రియ కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేసే ఆలోచనలో ఉంది. దాంతో ఈసారి పెద్దగా రాయబారాలకు అవకాశం లేకండా అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే మేయర్ ఆశావాహుల జాబితాలో ఉన్న కార్పోరేటర్లు కదనకుతుహలంతో ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో సర్వే రిపోర్టుల ఆధారంగా కసరత్తులు చేస్తున్నారు. తమకు ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుంటూ అనేక మంది ఎదురుచూపులతో గడుపుతున్నారు.

Also Read : పోలింగ్‌ ముగిసింది.. ఫలితంపైనే ఆసక్తి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి