iDreamPost

హర్మన్​ప్రీత్ సంచలన బ్యాటింగ్.. ఎవరూ ఊహించని విధ్వంసం ఇది!

  • Published Mar 10, 2024 | 12:22 PMUpdated Mar 10, 2024 | 12:22 PM

సిసలైన బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్. తుఫాన్ ఇన్నింగ్స్​తో ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద విరుచుకుపడింది.

సిసలైన బ్యాటింగ్ అంటే ఎలా ఉంటుందో చూపించింది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్. తుఫాన్ ఇన్నింగ్స్​తో ప్రత్యర్థి జట్టు బౌలర్ల మీద విరుచుకుపడింది.

  • Published Mar 10, 2024 | 12:22 PMUpdated Mar 10, 2024 | 12:22 PM
హర్మన్​ప్రీత్ సంచలన బ్యాటింగ్.. ఎవరూ ఊహించని విధ్వంసం ఇది!

విమెన్స్ ప్రీమియర్ లీగ్​-2024లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం రాత్రి గుజరాత్ జియాంట్స్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన జియాంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ముంబై 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. మ్యాచ్ మొత్తంలో ముంబై కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 95 నాటౌట్) బ్యాటింగ్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. సంచలన బ్యాటింగ్​తో రెచ్చిపోయిందామె. ఆకాశమే హద్దుగా బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడుతూ సింగిల్ హ్యాండ్​తో టీమ్​ను గెలిపింది. ఒక దశలో మ్యాచ్ జియాంట్స్​దేనని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఆ టైమ్​లో సంచలన బ్యాటింగ్​తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడింది హర్మన్​.

ముంబై గెలుపునకు చివరి 4 ఓవర్లలో 64 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. కానీ ఓవర్​కు 16 పరుగుల చొప్పున చేస్తే గానీ గెలవలేదు. నిలకడగా అంత రన్స్ చేయడం సులువు కాదు. వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోతే మొదటికే మోసం వస్తుంది. ఈ టైమ్​లో జూలు విదిల్చింది హర్మన్​ప్రీత్ కౌర్. తన అనుభవాన్ని అంతా రంగరించి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంది. అవతలి ఎండ్​లో ఉన్న అమెలియా కెర్ (12 నాటౌట్) స్ట్రైక్ రొటేషన్ చేస్తూ తమ సారథికి ఎక్కువ బంతులు ఆడే ఛాన్స్ ఇచ్చింది. ఎలాగైనా నెగ్గాలనే కసితో కనిపించిన హర్మన్ బౌండరీల కంటే సిక్సులు బాదేందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్​లో ఆమె బ్యాట్ నుంచి ఏకంగా 10 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు వచ్చాయి. దీన్ని బట్టే హర్మన్ బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి ఓవర్​కు ఎంత రన్స్ కొట్టాలనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ తన బ్యాట్​ను ఝళిపించింది హర్మన్​ప్రీత్. అలా చివరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్​ చేసి ముంబైకి మర్చిపోలేని విజయాన్ని అందించింది. ఇంటర్నేషనల్ కెరీర్​తో పాటు డబ్ల్యూపీఎల్​లోనూ ఎన్నో మంచి ఇన్నింగ్స్​లు ఆడింది హర్మన్. కానీ జియాంట్స్​ మీద ఆడిన నిన్నటి ఇన్నింగ్స్​ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వీర విజృంభణతో ఓటమి కోరల్లో నుంచి జట్టును బయటపడేయడం, ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేయడం, అంత ప్రెజర్​లోనూ పర్ఫెక్ట్ షాట్ మేకింగ్​తో అలరించడం అంటే మాటలు కాదు. కానీ దీన్ని అలవోకగా చేసి చూపించిందామె. అందుకే ఇది స్పెషల్ ఇన్నింగ్స్​గా నిలిచిపోతుంది. మరి.. హర్మన్ సంచలన బ్యాటింగ్​ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్‌పై సిరీస్‌ విజయంతో ఏం సాధించాడు? రోహిత్‌ ప్లానేంటి? WC కంటే పెద్ద టార్గెట్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి