iDreamPost

Hardik Pandya: హార్ధిక్‌ పాండ్యా కోసం రూ.100 కోట్లు చెల్లించిన ముంబై అంటూ వార్తలు!

  • Published Dec 25, 2023 | 4:43 PMUpdated Dec 25, 2023 | 8:33 PM

హార్ధిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారిన విషయం తెలిసిందే. క్రికెట్‌ వర్గాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే.. పాండ్యా కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దానికి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హార్ధిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ నుంచి ముంబై ఇండియన్స్‌కు మారిన విషయం తెలిసిందే. క్రికెట్‌ వర్గాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. అయితే.. పాండ్యా కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చు చేసిందనే వార్త ప్రస్తుతం క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తోంది. దానికి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 25, 2023 | 4:43 PMUpdated Dec 25, 2023 | 8:33 PM
Hardik Pandya: హార్ధిక్‌ పాండ్యా కోసం రూ.100 కోట్లు చెల్లించిన ముంబై అంటూ వార్తలు!

ఐపీఎల్‌ 2024 ఆరంభానికి చాలా ముందుగానే టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలిచింది. ఒక వైపు ఇండియా వర్సెస్‌ సౌతాఫ్రికా మ్యాచ్‌లు జరుగుతున్నా.. క్రికెట్‌ అభిమానులు మాత్రం ఐపీఎల్‌ గురించే మాట్లాడుకున్నారు. అందుకు కారణం.. హార్ధిక్‌ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌ను వీడి ముంబై ఇండియన్స్‌లోకి రావడం. ఇదే సంచలన విషయం అనుకుంటే.. రోహిత్‌ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్ధిక్‌ పాండ్యాకు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో పెను దుమారమే రేపింది. దీంతో ఒక్కసారిగా పాండ్యా, రోహిత్‌, ముంబై ఇండియన్స్‌ పేర్లు మారుమోగిపోయాయి. వన్డే వరల్డ్‌ కప్‌ ఓటమిని మర్చిపోయి.. క్రికెట్‌ అభిమానులను మరో టాపిక్‌ గురించి మాట్లాడుకునేలా చేసింది ఈ అంశమే.

ఐపీఎల్‌ 2022 కంటే ముందు వరకు హార్ధిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌కే ఆడిన విషయం తెలిసిందే. ఆ జట్టు ఐదు కప్పులు గెలిస్తే.. నాలుగు కప్పులు గెలిచిన టీమ్‌లో పాండ్యా సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి ఆటగాడు.. సడెన్‌గా గుజరాత్‌ టైటాన్స్‌కు వెళ్లాడు. ఐపీఎల్‌ 2022 సందర్భంగా రెండు కొత్త టీమ్స్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌. వీటిలో లక్నోకు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వెళ్లగా, గుజరాత్‌కు పాండ్యా కెప్టెన్‌ అయ్యాడు. కెప్టెన్‌ అవ్వడమే కాదు.. బరిలోకి దిగిన తొలి సీజన్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు పాండ్యా. దీంతో.. కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాకు మంచి మార్కులే పడ్డాయి.

ఆ విజయం ఏదో లక్క్‌ కొద్ది వచ్చింది కాదని నిరూపిస్తూ.. ఐపీఎల్‌ 2023లో కూడా గుజరాత్‌ టైటాన్స్‌ను తన కెప్టెన్సీలో ఫైనల్‌ వరకు తీసుకెళ్లాడు. దీంతో.. గుజరాత్‌ టైటాన్స్‌కు పాండ్యా సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గానే ఉన్నాడు. కానీ, ఏమైందో తెలియదు కానీ, గుజరాత్‌ నుంచి సడెన్‌గా ముంబైకి మారిపోయాడు. అయితే.. పాండ్యా తన ఇష్టప్రకారమే ముంబైకి వెళ్లాడని గుజరాత్‌ యాజమాన్యం వెల్లడించింది. అయితే.. పాండ్యాను తమ టీమ్‌లోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్‌ ఏకంగా రూ.100 కోట్లనున్స్‌ఫర్‌ ఫీ కింద గుజరాత్‌ టైటాన్స్‌కు చెల్లించినట్లు నేషనల్‌ మీడియాతో పాటు, రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. అయితే.. ఒక్క ఆటగాడి కోసం ఏకంగా రూ.100 కోట్లను చెల్లించడం మాత్రం క్రికెట్‌ వర్గాలను షాక్‌కు గురిచేసింది. అయితే.. దీనిపై ఇటు ముంబై కానీ, గుజరాత్‌ కానీ అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐపీఎల్‌ రూల్స్‌ ప్రకారం ట్రేడింగ్‌ అమౌంట్‌ను గోప్యంగానే ఉంచుకోవచ్చు. ఏది ఏమైనా.. పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి