iDreamPost

Jasprit Bumrah: ఆ కోచ్​ వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. బుమ్రా ఎమోషనల్!

  • Published Apr 11, 2024 | 7:17 PMUpdated Apr 11, 2024 | 7:18 PM

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్​, పర్ఫెక్ట్ లైన్‌ అండ్ లెంగ్త్​తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే.

పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్​, పర్ఫెక్ట్ లైన్‌ అండ్ లెంగ్త్​తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే.

  • Published Apr 11, 2024 | 7:17 PMUpdated Apr 11, 2024 | 7:18 PM
Jasprit Bumrah: ఆ కోచ్​ వల్లే ఈ స్థాయిలో ఉన్నా.. బుమ్రా ఎమోషనల్!

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా పేరు చెబితేనే బ్యాటర్లు వణికిపోతారు. నిఖార్సయిన పేస్​, పర్ఫెక్ట్ లైన్‌ అండ్ లెంగ్త్​తో అతడు వేసే బంతుల్ని ఎదుర్కోవడం టాప్ బ్యాటర్లకు కూడా కష్టమే. ప్రస్తుత జనరేషన్​లో బెస్ట్ పేసర్లలో ఒకడిగా కొనసాగుతున్న బుమ్రా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడు. వరుస సీజన్లలో అదరగొడుతూ టీమిండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. తక్కువ టైమ్​లోనే భారత జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకొని.. క్రమంగా మ్యాచ్ విన్నర్​గా రూపాంతరం చెందాడు. టీమిండియాకు తురుపు ముక్కగా మారిన ఈ పేసర్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఆ కోచ్ వల్లే తన ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు.

19 ఏళ్ల వయసులోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ ఇచ్చానని బుమ్రా తెలిపాడు. అప్పట్లో రంజీ ట్రోఫీలో ఆడతానని కూడా తాను అనుకోలేదని.. అలాంటిది ఐపీఎల్​లో ఆడే అవకాశం దక్కిందన్నాడు. ఆ సమయంలో తనలోని టాలెంట్​ను టీమిండియా మాజీ కోచ్ జాన్ రైట్ గుర్తించాడని అన్నాడు. జాన్ రైట్ వల్లే తాను ఎంఐ టీమ్​లోకి అడుగుపెట్టానన్నారు. ఆ జట్టులో ఆడుతూ ఏటికేడు తనను తాను మరింత మెరుగుపర్చుకున్నానని పేర్కొన్నాడు బుమ్రా. గత 11 ఏళ్ల కాలంలో 5 ఐపీఎల్ టైటిల్స్​ను ముంబై గెలుచుకుందని.. ఆ జట్టుతో తన ప్రయాణం మాటల్లో వర్ణించలేనిదని చెబుతూ పేసుగుర్రం ఎమోషనల్ అయ్యాడు. జాన్ రైట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని.. అతడే తనను మొదట గుర్తించి, సానబెట్టాడని చెప్పుకొచ్చాడు.

ఇక, ప్రముఖ మోడల్, ప్రెజెంటేటర్ సంజనా గణేశన్​ను బుమ్రా పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ 2021, మార్చి 15వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఈ జంటకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అతడికి అంగద్ అని పేరు పెట్టుకున్నారు. కొడుకు గురించి కూడా బుమ్రా మాట్లాడాడు. అంగద్​ తనను చూసి నవ్వడం వరల్డ్​లోనే బెస్ట్ మూమెంట్​లా అనిపిస్తుందని అన్నాడు. అతడి నవ్వుకు మించిన ఆనందం తనకు మరొకటి లేదన్నాడు. ఎక్కడికి వెళ్లినా దీన్ని మించిన సంతోషం మరొకటి లేదని.. అంగద్​ను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుందన్నాడు బుమ్రా. కాగా, ఐపీఎల్-2024లోనూ బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ పరుగులు అస్సలు ఇవ్వడం లేదు. అతడి ఎకానమీ 6.12గా ఉంది. మరి.. జాన్ రైట్ వల్లే ఈ స్థాయిలో ఉన్నానంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి