iDreamPost

ఓ ఇంటివాడైన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరంటే..

ఓ ఇంటివాడైన క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్.. వధువు ఎవరంటే..

మన దేశంలో క్రికెటర్లు, సినిమా వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అందుకే వీరికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిలకు సంబంధించిన వార్తలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే సెలబ్రిటీలు.. తమ పెళ్లికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటారు. ఇటీవల పలువురు టీమిండియా క్రికెటర్ల.. వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వారి బాటలోనే  ముంబై క్రికెటర్ 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు.

సర్ఫరాజ్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. జమ్ముకశ్మీర్ కు చెందిన యువతిని సంప్రదాయం ప్రకారం మనువాడాడు. వీరి వివాహం.. వధువు స్వస్థలమైన షోపియాన్ లో ఘనంగా జరిగింది.  సర్భరాజ్ ఖాన్ వివాహనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.  అలానే తన వివాహానికి సంబంధించిన ఫోటోలను ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్కున్నాడు. ఈ సందర్భంగా క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, రుతురాజ్  గైక్వాడ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా,క్రిస్ గేల్, ఆకాశ్ దీప్, మన్ దీప్ సింగ్ తదితరులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక పెళ్లి వేడుకలోనే టీమిండియాలోకి ఎంట్రి ఎప్పుడని మీడియ ప్రశ్నించింది. దేవుడు కరుణిస్తే.. ఏదో ఒక రోజు ఇండియా తరపున కచ్చితంగా ఆడతానని మీడియాకు సమాధానం ఇచ్చాడు. ముంబైకి చెందిన తాను.. జమ్ముకశ్మీర్ యువతిని పెళ్లి చేసుకోవడం విధి నిర్ణయమని ఆయన తెలిపారు. ముంబైకి  చెందిన ఈ యువ క్రికెట్ టీమిండియా ఎంట్రీ కోసం ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నాడు. దేశవాళీ మ్యాచ్ ల్లో  రికార్టులు సృష్టిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో మాత్రం పిలుపు రాలేదు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా సర్ఫరాజ్ ఖాన్ అంసతృప్తిగా ఉన్నాడని టాక్. సర్ఫరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయడం లేదని.. పలువురు మాజీలు సైతం అతడికి మద్దతుగా నిలిచారు.

అయితే ఫిట్‌నెస్, ప్రవర్తన కారణంగానే చోటు దక్కడం లేదని బీసీసీఐ వర్గాలు వివరణ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. దేశవాలీ క్రికెట్ లో ముంబై తరపున సర్ఫరాజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఆడగా.. సగటు..74.14తో 3559 పరుగులు చేశాడు. ఇందులో  13 సెంచరీలు  ఉన్నాయి. అంతేకాక 301 అతడి ఉత్తమ స్కోర్ గా రికార్డు ఉంది. 2022-23 సీజన్ రంజీ ట్రోఫిలో సర్ఫరాజ్ ఆరు మ్యాచుల్లో 92.66 సగటుతో 556 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలే ఉన్నాయి. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక అతడు కూడా త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశిద్దాం. మరి.. మీరు కూడా విషెష్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ఓటమికి పాండ్యానే కారణం? అతను చేసిన పెద్ద తప్పు ఏంటి?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి