iDreamPost

రోహిత్ శర్మ మమ్మల్ని తిట్టేవాడు.. కానీ! సర్ఫరాజ్ షాకింగ్ కామెంట్స్!

రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. ఈ సందర్భంగా రోహిత్ భాయ్ మమ్మల్ని తిట్టేవాడు కూడా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి నిజంగానే రోహిత్ వారిని తిట్టేవాడా? తిడితే ఎందుకు తిట్టేవాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి, అతడి వ్యక్తిత్వం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టీమిండియా యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్. ఈ సందర్భంగా రోహిత్ భాయ్ మమ్మల్ని తిట్టేవాడు కూడా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి నిజంగానే రోహిత్ వారిని తిట్టేవాడా? తిడితే ఎందుకు తిట్టేవాడు? పూర్తి వివరాల్లోకి వెళితే..

రోహిత్ శర్మ మమ్మల్ని తిట్టేవాడు.. కానీ! సర్ఫరాజ్ షాకింగ్ కామెంట్స్!

కెప్టెన్ గా జట్టులో ఏ ప్లేయర్ ను ఎలా వాడుకోవాలో మహేంద్రసింగ్ ధోనికి తెలిసినంతగా మరే ఇతర కెప్టెన్ కు కూడా తెలీదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ అలాంటి నాయకుడు ఎవరంటే? చాలా మంది రోహిత్ శర్మ పేరే చెబుతారు. ప్లేయర్లను మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్లుగా వాడుకోవడంలో సిద్ధహస్తుడు హిట్ మ్యాన్. ఇదొక్కటే కాకుండా ఆటగాళ్ల పర్సనల్ సమస్యలను కూడా దగ్గరుండి మరీ చూసుకుంటాడు. అశ్విన్ విషయంలో ఇది మరోసారి రుజువైంది. అయితే టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మాత్రం రోహిత్ శర్మ మమ్మల్ని తిట్టేవాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కానీ ఆ తిట్టడంలో ఓ మెలిక ఉండేదని చెప్పుకొచ్చాడు. మరి సర్ఫరాజ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.

సర్ఫరాజ్ ఖాన్.. డొమెస్టిక్ క్రికెట్ లో పరుగుల వరదపారించి ఎట్టకేలకు టీమిండియాలోకి అడుగుపెట్టాడు. ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్.. తొలి మ్యాచ్ లోనే సూపర్ ఫిఫ్టీతో అదరగొట్టాడు. ఈ తర్వాత మ్యాచ్ ల్లో సైతం అర్ధసెంచరీలతో అలరించాడు. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ఇదిలా ఉండగా.. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధం, నాయకుడిగా అతడి వ్యక్తిత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఈ యువ క్రికెటర్.

sarfrak khan comments on rohit sharma

రోహిత్ గురించి సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ..”రోహిత్ భాయ్ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను, ఐపీఎల్ లో కూడా ఆడాను. కానీ వాటన్నింటితో పోలిస్తే.. రోహిత్ కెప్టెన్సీ ఆడటం నాకెంతో సంతోషంగా ఉంది. అతడు అద్భుతమైన కెప్టెన్. అందరిని కలుపుకొని వెళ్తూ ఉంటాడు. ఇక టీమ్ మీటింగ్ జరుగుతున్న సమయంలో రోహిత్ భాయ్ మాట్లాడుతుంటే.. నాకు అమిర్ ఖాన్ లగాన్ మూవీ గుర్తుకొస్తుంది. అయితే భాయ్ మమ్మల్ని అప్పుడప్పుడు తిడతాడు. కానీ మరీ ఎక్కువ కాదు. యంగ్ ప్లేయర్లను గైడ్ చేసేందుకు కాస్త గట్టిగానే హెచ్చరిస్తాడు. అతడు మమ్మల్ని తిట్టినా.. మాకు తిట్టినట్లు అనిపించదు” అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. కాగా.. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాళీగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించిన అతడిని ఆ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. కానీ గతేడాది జరిగిన మినీ వేలంలో సర్ఫరాజ్ ను కొనేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడంతో.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.

ఇదికూడా చదవండి: పేరుకే అనామక ఆటగాడు.. కానీ ఆ విషయంలో కోహ్లీ, రోహిత్, బాబర్ కంటే తోపు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి