iDreamPost

టీమిండియా ఓటమికి పాండ్యానే కారణం? అతను చేసిన పెద్ద తప్పు ఏంటి?

  • Published Aug 07, 2023 | 10:26 AMUpdated Aug 08, 2023 | 7:36 AM
  • Published Aug 07, 2023 | 10:26 AMUpdated Aug 08, 2023 | 7:36 AM
టీమిండియా ఓటమికి పాండ్యానే కారణం? అతను చేసిన పెద్ద తప్పు ఏంటి?

వెస్టిండీస్‌ పర్యటన టీమిండియాకు ఓ పీడలా మారుతోంది. టెస్ట్‌ సిరీస్‌ను 1-0తో, వన్డే సిరీస్‌ను 2-1తో నెగ్గి సోసో అనిపించిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం దారుణంగా పరువు పొగొట్టుకుంటుంది. వన్డే వరల్డ్‌ కప్‌ 2023, అలాగే గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌కు కనీసం క్వాలిఫై కాలేకపోయిన వెస్టిండీస్‌ చేతిలో టీ20 సిరీస్‌ ఓటమి టీమిండియా ప్రతిష్టను దెబ్బతీసే అంశం. పైగా టీ20 క్రికెట్‌లో హేమాహేమీలు, ఐపీఎల్‌ హీరోలు ఉన్న జట్టు.. గతమెంత ఘనం.. ఇప్పుడంతా పసికూనతనంగా తయారైన వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ వరసగా రెండు మ్యాచ్‌లు ఓడింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో 0-2తో వెనుకబడింది. కాగా.. రెండో ఓటమి తర్వాత టీ20 జట్టుకు అనాధికారికంగా రెగ్యులర్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

టీమిండియా ఓటమిని క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వెస్టిండీస్‌పై రెండు మ్యాచ్‌ల్లో వరుస ఓటములను అస్సలు తట్టుకోలేపోతున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను రెస్ట్‌ పేరుతో పూర్తిగా యువ టీమిండియాను బరిలోకి దించుతున్న బీసీసీఐ.. వాళ్లు లేకుంటే టీమ్‌ ఎంత అధ్వానంగా ఉందో రుచిచూస్తోంది. అది పక్కనపెడితే.. హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీపైనే ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. కేవలం ఇగో, యాటిట్యూడ్‌తోనే పాండ్యా నెట్టుకొస్తున్నాడని, ఐపీఎల్‌ టీమ్‌కు చేసిన కెప్టెన్సీ చూసి టీమిండియాను అతని చేతుల్లో పెడితే.. రిజల్ట్‌ ఇలాగే ఉంటుందని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. గతంలో టీమిండియాను రెండు మూడు జట్లుగా చేయవచ్చని పాండ్యా చేసిన వ్యాఖ్యలు కూడా అతనిపై ఈ స్థాయిలో విమర్శలు రావడానికి కారణంగా చెప్పొకోవచ్చు.

ఇంతకీ పాండ్యా చేసిన తప్పులేంటి?
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌నే తీసుకుంటే.. పాండ్యా దారుణమైన తప్పులు చేశాడు. భారత్‌ బ్యాటింగ్‌ విభాగం దారుణంగా విఫలం అయినప్పటికీ.. కెప్టెన్‌గా పాండ్యా చేసిన తప్పిదాలు కూడా టీమిండియాకు మ్యాచ్‌ను దూరం చేశాయి. పవర్ ప్లేలో రవి బిష్ణోయ్‌కు బౌలింగ్ ఇవ్వడం.. యుజ్వేంద్ర చాహల్‌కు పూర్తి కోటా బౌలింగ్ ఇవ్వకపోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీశాయి. ముఖ్యంగా 18వ ఓవర్‌లో చాహల్‌కు బౌలింగ్ ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. 153 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పాండ్యా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే విండీస్‌ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

కానీ ఆ ఆనందం టీమిండియాకు ఎక్కువ సేపు ఉండలేదు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్, కైల్ మేయర్స్‌ భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. కైల్ మేయర్స్‌(15)కు అర్ష్‌దీప్ సింగ్ కళ్లెం వేసినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పూరన్ దూకుడు తగ్గించలేదు. రవి బిష్ణోయ్ వేసిన పవర్‌ ప్లే చివరి ఓవర్‌లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో విండీస్ పవరర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 61 పరుగులు రాబట్టుకుంది. ఇక 16వ ఓవర్‌లో చాహల్‌ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టారు. కానీ, ఆ తర్వాత అతనికి బౌలింగ్‌ ఇవ్వలేదు. 18వ ఓవర్‌ మళ్లీ చాహల్‌కు ఇస్తే అదే ఊపులో అతను మరికొన్ని వికెట్లు పడగొట్టేవాడు. ఇక్కడే కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా ఫెయిల్‌ అయ్యాడు. ఇలా కెప్టెన్సీ తప్పిదాలతో హార్దిక్‌ పాండ్యా టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. అలాగే బ్యాటింగ్‌లోనే పెద్దగా రాణించలేదు. మరి కెప్టెన్‌ పాండ్యా విఫలం అయ్యాడనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హాఫ్‌ సెంచరీ తర్వాత తిలక్‌ కూల్‌ సెలబ్రేషన్స్‌! ఎవరి కోసమో తెలుసా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి