iDreamPost

గవాస్కర్​కు సారీ చెప్పిన సర్ఫరాజ్.. ఆ తప్పు రిపీట్ చేయనంటూ..!

  • Published Mar 13, 2024 | 7:48 PMUpdated Mar 13, 2024 | 7:48 PM

బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్​కు టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సారీ చెప్పాడు. మళ్లీ ఆ తప్పు చేయనని అన్నాడు. అసలు సర్ఫరాజ్ ఎందుకు క్షమాపణలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్​కు టీమిండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సారీ చెప్పాడు. మళ్లీ ఆ తప్పు చేయనని అన్నాడు. అసలు సర్ఫరాజ్ ఎందుకు క్షమాపణలు చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 13, 2024 | 7:48 PMUpdated Mar 13, 2024 | 7:48 PM
గవాస్కర్​కు సారీ చెప్పిన సర్ఫరాజ్.. ఆ తప్పు రిపీట్ చేయనంటూ..!

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్ టీమిండియాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఛటేశ్వర్ పుజారా, అజింక్యా రహానె లాంటి స్టార్లు లేకుండానే బరిలోకి దిగిన భారత్ అద్భుతాలు చేసింది. కుర్రాళ్లతో నిండిన జట్టు ఐదు టెస్టుల సిరీస్​ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. బజ్​బాల్ బెండు తీస్తూ ఇంగ్లండ్​ను వరుసగా నాలుగు టెస్టుల్లో చిత్తుగా ఓడించింది. ఈ గెలుపులో కెప్టెన్ రోహిత్ శర్మ సహా సీనియర్ ఆటగాళ్లు అశ్విన్, బుమ్రా, జడేజా కీలక పాత్ర పోషించారు. అరంగేట్ర ఆటగాళ్లు సర్ఫరాజ్, జురెల్, ఆకాశ్ చోప్రా కూడా సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సర్ఫరాజ్, జురెల్ ఈ సిరీస్​లో అదరగొట్టారు. భారత ఫ్యూచర్ తామేనని ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ సిరీస్​లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన సర్ఫరాజ్ సారీ చెప్పాడు.

టీమిండియా లెజెండ్ సునీల్‌ గవాస్కర్​కు సర్ఫరాజ్ క్షమాపణలు చెప్పాడు. ఇంగ్లండ్​తో సిరీస్​లో 3 హాఫ్ సెంచరీలు సహా మొత్తం 200 పరుగులు చేసిన సర్ఫరాజ్ మీద ఓ విషయంలో గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. క్రీజులో కుదురుకున్నాక చెత్త షాట్​తో అతడు తరచూ వికెట్ సమర్పించుకోవడం సరైంది కాదని.. ప్రతిసారీ కొత్త బాల్​ను ఫేస్ చేస్తున్నాననే ఫీలింగ్​తో ఆడే డాన్ బ్రాడ్​మన్ వ్యాఖ్యల్ని గవాస్కర్ ఉదహరించాడు. తన మీద సన్నీ చేసిన కామెంట్స్​పై సర్ఫరాజ్ కూడా బాధపడ్డాడట. ఈ విషయాన్ని గవాస్కర్​కు అత్యంత ఆప్తుడు అయిన బిజినెస్​మన్ శ్యామ్ భాటియా తెలిపాడు. సర్ఫరాజ్​కు గవాస్కర్ కీలక సూచన చేశాడని.. షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడని చెప్పుకొచ్చాడు.

‘షాట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్​కు గవాస్కర్ హెచ్చరించాడు. దీనిపై దాదాపు 45 నిమిషాల పాటు అతడితో చర్చించాడు. కానీ ఇంగ్లండ్​తో ఆఖరి టెస్టులో టీ బ్రేక్ తర్వాత చెత్త షాట్​ కొట్టి సర్ఫరాజ్ ఔట్ అయ్యాడు. దీంతో గవాస్కర్​కు కోపం తన్నుకొచ్చింది. కామెంట్రీ సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు ఈ విషయం గురించి సర్ఫరాజ్ నాతో మాట్లాడాడు. గవాస్కర్​ సార్​కు సారీ చెబుతున్నానని.. నేను తప్పు చేశానన్నాడు. మళ్లీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ కాదన్నాడు’ అని శ్యామ్ భాటియా తెలిపారు. కాగా, ధర్మశాల టెస్టులో దేవదత్ పడిక్కల్​తో కలసి ఐదో వికెట్​కు 97 పరుగులు జోడించిన సర్ఫరాజ్.. టీ బ్రేక్ తర్వాత ఔట్ అయ్యాడు. ఆ టైమ్​లో కామెంట్రీ చేస్తున్న గవాస్కర్.. షాట్ కొట్టేందుకు అనువుగా లేని బాల్​ను ఆడేందుకు ప్రయత్నించి వికెట్ ఇచ్చేశాడని అన్నాడు. మరి.. గవాస్కర్​కు సర్ఫరాజ్ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా పరువు నిలిపిన కుర్రాళ్లు.. రోహిత్​ వల్లే ఇది సాధ్యమైంది!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి