iDreamPost

అంబానీ కుటుంబం తాగే ఈ పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా.. ధర కూడా భారీగానే

  • Published Jun 10, 2024 | 3:16 PMUpdated Jun 10, 2024 | 3:16 PM

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ వార్తే అవుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబం తాగే పాలు.. వాటి ప్రత్యేకత గురించి నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

Mukesh Ambani: ముఖేష్‌ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ వార్తే అవుతుంది. ఈ క్రమంలో ఆ కుటుంబం తాగే పాలు.. వాటి ప్రత్యేకత గురించి నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు..

  • Published Jun 10, 2024 | 3:16 PMUpdated Jun 10, 2024 | 3:16 PM
అంబానీ కుటుంబం తాగే ఈ పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా.. ధర కూడా భారీగానే

ఆసియా కుబేరుడు ముఖేష్‌ అంబానీ చేసే వ్యాపారాల గురించే కాక.. ఆయన కుటుంబానికి సంబంధించి కూడా తరచుగా ఏదో ఒక వార్త వస్తునే ఉంటుంది. ఇక అంబానీ ఇంట ఏదైనా శుభకార్యం నిర్వహిస్తే.. దాని గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. కొన్ని రోజుల క్రితం అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహించారో చూశాం కదా. ఈ వేడుకలకు వచ్చిన గెస్ట్‌ల దగ్గర నుంచి వారికి వడ్డించిన భోజనం, వసతి, రిటర్న్‌ గిఫ్ట్స్‌, కాబోయే వధూవరులకు అంబానీ దంపతులు ఇచ్చిన బహుమతులు ఇలా ప్రతీ దాని గురించి బోలేడు వార్తలు వచ్చాయి. ఇక అప్పుడప్పుడు అంబానీ ఫ్యామిలీలో వాడే వస్తువులు, కార్లు, ఆభరణాల గురించి కూడా మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఇప్పుడీ కోవలోకి అంబానీ ఫ్యామిలీ తాగే పాలు వచ్చి చేరాయి. ఈ కుటుంబం తాగే పాలకు చాలా ప్రత్యేకత ఉంది. వీరితో పాటు మరి కొందరు సెలబ్రిటీలు కూడా ఇదే పాలు తాగుతారు. మరి అవి ఏ పాలో.. వాటిలోని ప్రత్యేకతలేంటో తెలియాలంటే ఇది చదవండి.

మరికొద్ది రోజుల్లో ముకేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం జరగనుంది. ఇప్పటి నుంచే ఆ వేడకకు సంబంధించి బోలేడు వార్తలు వస్తున్నాయి. వీటి మధ్యలో ఓ ఆసక్తికర వార్త అందరిని ఆకర్షిస్తోంది. అదే అంబానీ ఫ్యామిలీ తాగే పాలు, వాటి ప్రత్యేకతలకు సంబంధించిన వార్త వైరల్‌గా మారింది. సాధారణంగానే ముఖేష్‌ అంబానీతో పాటు ఆయన భార్య, బిడ్డలు కూడా తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రోటీన్స్‌, పోషకాలు సమృద్ధిగా ఉండేలా.. డైటీషియన్‌ చెప్పిన దాని ప్రకారం సమతుల్య ఆహారం తీసుకుంటారు. అలానే వారు తాగే పాలు కూడా చాలా ప్రత్యేకమైనవి అంఉన్నారు. అంబానీ కుటుంబం తాగే పాలు పుణే నుంచి వస్తాయట. హోల్‌ స్టెయిన్‌-ఫ్రీసియన్‌ అనే విదేశీ జాతికి చెందిన ఆవు పాలు తాగుతారట.

సాధారణంగానే పాలల్లో కాల్షియం అధికంగా ఉండి.. ఎముకలను బలంగా చేస్తాయి. స్టెయిన్-ఫ్రీసియన్ ఆవు పాలల్లో మామూలు ఆవుల పాల కంటే ఎక్కువ మొత్తంలో పోషకాలుంటాయి అంటున్నారు. వీటిలో ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయట. పూణేలో స్పెషల్ హైటెక్ లెవల్ లో 35 ఎకరాల్లో ఓ డెయిరీ ఫామ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే అంబానీ ఫ్యామిలీకి పాలు సరఫరా అవుతాయి. ఈ ఆవులు.. మామూలు వాటర్ తాగవు. ఆర్ఓ వాటర్ మాత్రమే తాగుతాయట. అవి తినే ఆహారం కూడా చాలా స్పెషలే. అందుకే.. వీటి పాలు కూడా సాధారణంగా ఉండవు. ఒక్కో ఆవు రోజుకి కనీసం 25 లీటర్ల పాలు ఇవ్వగలదట. అంబానీ కుటుంబంతో పాటు సచిన్ టెండుల్కర్, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీస్ కూడా ఇవే పాలను వాడతారట. వీటి ధర కూడా.. ఎక్కువగా ఉంటుందని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి